మహనీయుల అడుగుజాడల్లో నడవాలి

ABN , First Publish Date - 2021-03-01T05:54:47+05:30 IST

సంస్కృతి, సంప్రదాయాలను సమాజానికి పరిచయం చేసిన మహనీయుల అడుగుజాడల్లో మనమంతా నడవాలని అప్పుడే వారి కల నెరవేరుతుందని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని రాంలీలా మైదానంలో నిర్వహించిన గోండిధర్మ, హీరాసుక జయంతి వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

మహనీయుల అడుగుజాడల్లో నడవాలి
పర్ధాన్‌ చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న జడ్పీ చైర్మన్‌, ఎమ్మెల్యే,

ఎమ్మెల్యే జోగు రామన్న 

ఘనంగా హీరాసుక జయంతి వేడుకలు

ఆదిలాబాద్‌టౌన్‌, ఫిబ్రవరి 28: సంస్కృతి, సంప్రదాయాలను సమాజానికి పరిచయం చేసిన మహనీయుల అడుగుజాడల్లో మనమంతా నడవాలని అప్పుడే వారి కల నెరవేరుతుందని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని రాంలీలా మైదానంలో నిర్వహించిన గోండిధర్మ, హీరాసుక జయంతి వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ముందుగా హీరాసుక ప్రతిమకు పూలమాల వేసి నివాళులర్పించారు. కాగా పర్ధాన్‌ సంఘం ఆధ్వర్యలో నిర్వహించిన వేడుకల్లో పర్దాన్‌ కులస్థులు, కళాకారులు, యువతి, యువకులుచేసిన సంప్రదాయ నృత్యాలు అందరిని అలరించాయి. ఇందులో భాగంగా ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ ఆయా ప్రజల ఆచార వ్యవహారాలను, సంస్కృతి సంప్రదాయాలను ప్రభుత్వం గుర్తించి ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించి వేడుకలు జరుపుతుందని తెలిపారు. పర్ధాన్‌ సంఘం సభ్యులు, ప్రజల కోరిక మేరకు వచ్చే యేడాది హీరాసుక జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించేలా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఈ సందర్భంగా పర్ధాన్‌ సమాజ్‌ చరిత్రను పొందుపరిచి ముద్రించిన పుస్తకాలను అతిథులు ఆవిష్కరించారు. ఇందులో జడ్పీ చైర్మన్‌ రాథోడ్‌ జనార్దన్‌, మాజీ ఎంపీ నగేష్‌, అదనపు రాష్ట్ర డీసీపీ బాపురావు, పర్దాన్‌ సంఘం జిల్లా అధ్యక్షుడు దుర్వ నగేష్‌, నాయకులు డా.మనోహార్‌, శంకర్‌, రాంకిషన్‌, తానాజి తదితరులున్నారు. 

హీరాసుకకు నివాళి...

హీరాసుక జయంతి సందర్భంగా ఆదివారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద ఉన్న హీరాసుక విగ్రహం వద్ద కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌, ఎస్పీ విష్ణు ఎస్‌.వారియర్‌లు, పర్ధాన్‌ సంఘం సభ్యులు, నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. వీరితో పాటు ఎమ్మెల్యే జోగు రామన్న, మాజీ ఎంపీ నగేష్‌, రైతు సంఘం  జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా రవిదాస్‌ జయంతి..

ఆదిలాబాద్‌టౌన్‌: జిల్లా కేంద్రంలోని మోచిగల్లీలో గల మోచి భవన్‌లో సంత్‌ రవిదాస్‌ జయంతిని రాష్ట్ర మోచి సంఘం కార్యదర్శి బాల శంకర్‌ కృష్ణ, జిల్లా అధ్యక్షుడు బైరి సాయన్న ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే జోగు రామన్న ముఖ్య అతిథిగా హాజరై సంత్‌ రవిదాస్‌ చిత్రపటానికి పూజ నిర్వహించారు. వీరితో పాటు ఆదిలాబాద్‌ మార్కెట్‌ కమిటీ అధ్యక్షుడు మెట్టు ప్రహ్లాద్‌, పట్టణ అధ్యక్షుడు సంతోష్‌, సంఘ పెద్దలు పాల్గొన్నారు. అనంతరరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. 

Updated Date - 2021-03-01T05:54:47+05:30 IST