వాకర్స్‌ క్లబ్‌, లయన్స్‌క్లబ్‌ సహకారంతో వాకర్స్‌ ట్రాక్‌

ABN , First Publish Date - 2021-03-01T04:48:28+05:30 IST

వాకర్స్‌ క్లబ్‌-లయన్స్‌క్లబ్‌ సహకారంతో అరవపల్లెలోని నందలూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో వాకర్స్‌ ట్రాక్‌కు ఆదివారం పనులను ప్రారంభించారు.

వాకర్స్‌ క్లబ్‌, లయన్స్‌క్లబ్‌ సహకారంతో వాకర్స్‌ ట్రాక్‌

నందలూరు, ఫిబ్రవరి28 : వాకర్స్‌ క్లబ్‌-లయన్స్‌క్లబ్‌ సహకారంతో అరవపల్లెలోని నందలూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో వాకర్స్‌ ట్రాక్‌కు ఆదివారం పనులను ప్రారంభించారు. ఇటీవల కురిసిన వర్గాలతో వాకర్స్‌ ట్రాక్‌ పూర్తిగా పాడవడంతో ఉదయం, సాయంత్రం, వాకింగ్‌కి వెళ్లే వారికి తీవ్ర ఇబ్బంది ఏర్పడి ఇటు రైల్వే స్టేషన్లు, ఇటు కడప చెన్నై ప్రధాన రహదారిని ఆశ్రయించారు. ఈ విషయాన్ని గమనించిన వాకర్స్‌, లయన్స్‌క్లబ్‌ నాయకులు ట్రాక్‌ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో వాకర్స్‌, లయన్స్‌క్లబ్‌ నాయకులు జంగంశెట్టి చంద్ర, ఏఎ్‌సఐ రామ్మోహన్‌, దాసరి నరసింహులు, గురు ప్రసాద్‌, కుర్రా మణియాదవ్‌, మోడపోతుల రాము, రమణ, జంగంశెట్టి హరి, మస్తానయ్య, రామ్మోహన్‌రెడ్డి, బొంత రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-03-01T04:48:28+05:30 IST