పాడేరులో మావోలకు వ్యతిరేకంగా వెలసిన వాల్ పోస్టర్లు

ABN , First Publish Date - 2022-08-04T14:21:45+05:30 IST

మావోయిస్టులకు వ్యతిరేకంగా పాడేరులో వెలసిన వాల్ పోస్టర్లు కలకలం రేపుతోంది.

పాడేరులో మావోలకు వ్యతిరేకంగా వెలసిన వాల్ పోస్టర్లు

అల్లూరి: మావోయిస్టుల(Maoists)కు వ్యతిరేకంగా పాడేరులో వెలసిన వాల్ పోస్టర్లు (Postars) కలకలం రేపుతోంది. అల్లూరి ఆదివాసీ యువజన సంఘం పేరిట పోస్టర్లు వెలశాయి. గిరిజనులకు ఉపయోగపడని వారోత్సవాలు వద్దని, అమాయక గిరిజనులను ఇంఫార్మర్ నెపంతో చంపుతున్నారని పోస్టర్లో పేర్కొన్నారు. సెల్ టవర్లు పేల్చి ప్రభుత్వ పథకాలను, మా గిరియువత విజ్ఞాన అవకాశాలను దూరం చేస్తున్నారని అన్నారు. రోడ్లు రాకుండా చేసి అభివృద్ధికి దూరంగా బతకమన్నారు. మావోయిస్టులారా మీరు ఎక్కడవుంటే అక్కడ వినాశనం, విధ్వంసం అంటూ పోస్టర్లు వెలిశాయి. 

Updated Date - 2022-08-04T14:21:45+05:30 IST