టీ20 ప్రపంచకప్‌లో ఆడాలనుంది: దినేశ్ కార్తీక్

ABN , First Publish Date - 2022-04-17T22:13:11+05:30 IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్న టీమిండియా వికెట్

టీ20 ప్రపంచకప్‌లో ఆడాలనుంది: దినేశ్ కార్తీక్

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్న టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తీక్ అదరగొడుతున్నాడు. చిచ్చర పిడుగల్లే చెలరేగుతూ జట్టు విజయాలు సాధించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. శనివారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లోనూ కార్తీక్ మెరుపు ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. 34 బంతుల్లోనే 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 66 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. బ్రిలియంట్ ఫినిషర్‌గా పేరుతెచ్చుకున్న కార్తీక్ ఇప్పుడు తన దృష్టిని టీ20 ప్రపంచకప్‌పై నిలిపాడు. 


ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరగనున్న ప్రపంచకప్‌లో తలపడనున్న భారత జట్టులో చోటు సంపాదించడమే లక్ష్యంగా కార్తీక్ అడుగులు వేస్తున్నాడు. ఐపీఎల్ ప్రారంభానికి ముందు వరకు ప్రపంచకప్ రేసులో లేని కార్తీక్.. అద్భుత ఇన్నింగ్స్‌తో రేసులోకి వచ్చాడు. శనివారం నాటి మ్యాచ్ అనంతరం కోహ్లీతో కార్తీక్ మాట్లాడుతూ.. తనకో చిన్న లక్ష్యం ఉందని చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో దేశం తరపున ఆడాలని ఉందని మనసులో మాట బయటపెట్టాడు. మల్టీనేషన్ టోర్నమెంటులో భారత్ గెలిచి చాలాకాలం అయిందన్నాడు. ఈసారి భారత్ సాధించే విజయాల్లో తన పాత్ర కూడా ఉండాలని తాను భావిస్తున్నట్టు కార్తీక్ చెప్పుకొచ్చాడు. 

Updated Date - 2022-04-17T22:13:11+05:30 IST