బ్రిటన్‌లో ఎంబీయే చదవాలనుందా..? మరి ఈ విషయాల గురించి మీకు తెలుసా..?

ABN , First Publish Date - 2022-09-17T01:01:59+05:30 IST

బ్రిటన్‌లో ఎంబీయే చదవాలనుందా..? మరి ఈ విషయాల గురించి మీకు తెలుసా..?

బ్రిటన్‌లో ఎంబీయే చదవాలనుందా..? మరి ఈ విషయాల గురించి మీకు తెలుసా..?

ఎన్నారై డెస్క్: కార్పొరేట్ రంగంలో దూసుకుపోవాలనుకుంటున్న విద్యార్థులకు విదేశీ ఎంబీయే(MBA) చదువులు ఎంతో ఉపకరిస్తాయి. ఇక టాప్ బ్రిటన్ యూనివర్శిటీల్లో(Britain Business schools) ఎంబీయే డిగ్రీతో యువతకు అందే అవకాశాలు అపారం. అంతేకాకుండా.. పలు బ్రిటన్ బిజినెస్ స్కూళ్లు.. ఏడాది నిడివిగల ఎంబీయే కోర్సులు అందిస్తున్నాయి. ఫలితంగా ఖర్చులు తగ్గడంతో పాటూ తక్కువ వ్యవధిలోనే కోర్సు పూర్తి చేయవచ్చు. అయితే.. వీటిల్లో సీటు కోసం పోటీ కూడా అదే స్థాయిలో ఉంటుంది. మరి బ్రిటన్ యూనివర్శిటీల్లో సీటు దక్కే ఛాన్స్ ఎంతుందో.. ఓమారు చూద్దాం పదండి.. 


బ్రిటన్ కళాశాలలకు ఏటా భారీ సంఖ్యలో విద్యార్థులు దరఖాస్తులు చేసుకుంటుంటారు. కానీ కొందరికి మాత్రమే తాము కోరుకున్న బిజినెస్ స్కూల్‌లో సీటు దక్కుతుంది. దీన్నే ఎక్సెప్టెన్స్ రేట్(Acceptance Rate) అని అంటారు. ఉదాహరణకు ఓ కళాశాల ఎక్సెప్టెన్స్ రేట్ 25 శాతం ఉందనుకుంటే.. దరఖాస్తు చేసుకున్న ప్రతి 100 మంది విద్యార్థుల్లో 25 మందికి మాత్రమే సీటు దక్కుతుందని అర్థం. బ్రిటన్‌లో టాప్ కళాశాలల ఎక్సెప్టెన్స్ రేట్ ఎంతంటే.. 


లండన్ బిజినెస్ స్కూల్ - 25%

ఈఎస్‌సీపీ బిజినెస్ స్కూల్ - 10%

సెయిడ్ బిజినెస్ స్కూల్, ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ - 20%

సిటీ యూనివర్శిటీ,  కాస్ యూనివర్శిటీ ఆఫ్ కేంబ్రిడ్జి - 50%

వార్విక్ బిజినెస్ స్కూల్ - 50%

ఇంపీరియల్ బిజినెస్ స్కూల్ - 60%

అలయన్స్ మాంచెస్టర్ బిజినెస్ స్కూల్ - 45%

యూనివర్శిటీ ఆఫ్ లండన్ - 11%

హెన్లీ బిజినెస్ స్కూల్ - 58%

క్రాన్‌ఫీల్డ్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ - 30%

Updated Date - 2022-09-17T01:01:59+05:30 IST