PUB Rape Case : రాజీనామా చేసే ప్రసక్తే లేదు.. నన్నెవరూ తప్పించలేరు : వక్ఫ్‌ బోర్డ్ చైర్మన్‌

ABN , First Publish Date - 2022-06-09T20:47:40+05:30 IST

తెలుగు రాష్ట్రాల్లో పెనుసంచలనం సృష్టించిన అమ్నీషియా పబ్ మైనర్ రేప్ కేసులో వక్ఫ్‌ బోర్డ్ చైర్మన్‌ మసివుల్లా కొడుకు నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే.

PUB Rape Case : రాజీనామా చేసే ప్రసక్తే లేదు.. నన్నెవరూ తప్పించలేరు : వక్ఫ్‌ బోర్డ్ చైర్మన్‌

హైదరాబాద్ సిటీ : తెలుగు రాష్ట్రాల్లో పెనుసంచలనం సృష్టించిన అమ్నీషియా పబ్ మైనర్ రేప్ కేసులో వక్ఫ్‌ బోర్డ్ చైర్మన్‌ మసివుల్లా కొడుకు నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సంఘటన జరిగినప్పట్నుంచీ చైర్మన్ పదవికి ఆయన అనర్హుడని.. రాజీనామా చేయాల్సిందేనని ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు డిమాండ్  చేస్తున్నాయి. అంతేకాదు.. ఆయనతో రాజీనామా చేయించాలని హోం మంత్రి మహమూద్‌ అలీ కూడా విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు.. రాజీనామా చేయాలని వక్ఫ్‌ బోర్డ్ చైర్మన్‌కు టీఆర్‌ఎస్‌ అధిష్టానం ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే.. తాను  రాజీనామా చేసే ప్రసక్తేలేదని.. మసివుల్లా చెబుతున్నారు. తనను పదవి నుంచి ఎవరూ తప్పించలేరని వక్ఫ్‌ బోర్డ్ చైర్మన్‌ ధీమాగా చెబుతున్నారు. మరి ఈ వ్యవహారంపై టీఆర్ఎస్ అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాలి.


ఇదిలా ఉంటే.. ఈ  రేప్ కేసులో పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. రేప్ కేస్ నిందితులను ట్రయల్ సమయంలో మేజర్లుగా పరిగణించాలని జువైనల్ జస్టిస్ బోర్డ్‌ (Juvenile Justice Board‌)ను పోలీసులు కోరారు. ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన తరువాత ట్రయల్ జరిగే సమయంలో ఐదుగురిని అడల్ట్‌లుగా పరిగణించాలని జువైనల్ జస్టిస్‌కు హైదరాబాద్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. పోలీసుల విజ్ఞప్తిపై జువైనల్ జస్టిస్ దే తుది నిర్ణయం. మైనర్ల మానసిక స్థితి, నేరం చేయడానికి వారికి ఉన్న సామర్థ్యం అన్నింటినీ పరిగణలోకి తీసుకుని జువైనల్ జస్టిస్ నిర్ణయాన్ని వెల్లడించనుంది.

Updated Date - 2022-06-09T20:47:40+05:30 IST