లేఖల యుద్ధం

ABN , First Publish Date - 2021-08-06T00:13:46+05:30 IST

కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు, తెలంగాణ ప్రభుత్వం మధ్య లేఖల యుద్ధం

లేఖల యుద్ధం

హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు, తెలంగాణ ప్రభుత్వం మధ్య లేఖల యుద్ధం జరుగుతోంది. ఈ నెల 3న కేఆర్‌ఎంబీ&జీ ఆర్ఎంబీల సంయుక్త సమన్వయ సమావేశం నిర్వహించారు. అయితే ఈ సమావేశాన్ని తెలంగాణ అధికారులు బహిష్కరించారు. పూర్తిస్థాయి సమావేశం ఏర్పాటు చేయాలని ఇరు బోర్డులకు, కేంద్రానికి తెలంగాణ సర్కార్ లేఖ రాసింది.  తెలంగాణ ప్రభుత్వం రాసిన లేఖపై స్పందిస్తూ ఈనెల 9న అత్యవసర పూర్తిస్థాయి సమావేశాన్ని కృష్ణ, గోదావరి బోర్డులు ఏర్పాటు చేసాయి. న్యాయస్థానాల్లో ప్రాజెక్టులకు సంబంధించిన పలు కీలక కేసుల విచారణ దశలో ఉన్నందున బోర్డు నిర్వహించే అత్యవసర సమావేశానికి హాజరు కాలేమని తెలంగాణ తేల్చి చెప్పింది.   

Updated Date - 2021-08-06T00:13:46+05:30 IST