Rain: వరంగల్లో ఎడతెరపిలేకుండా కురుస్తున్న వాన
ABN , First Publish Date - 2021-07-22T13:14:55+05:30 IST
ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలుచోట్ల ఎడతెరిపి లేకుండా వాన కురుస్తోంది.
వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలుచోట్ల ఎడతెరిపి లేకుండా వాన కురుస్తోంది. రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జిల్లాలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇళ్లల్లో వర్షపు నీరు వచ్చి చేరడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు.