Advertisement

వరంగల్‌లో కరోనా విలయతాండవం

May 4 2021 @ 14:09PM

వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరోనా విలయతాండవం చేస్తోంది. కరోనా కాటుకు కుటుంబాలే బలి అవుతున్నాయి. ఒకే ఇంట్లో వారంలోనే ముగ్గురు మృతి చెందారు. గంట వ్యవధిలోనే అన్నదమ్ములు మృత్యువాత పడ్డారు. జనగామకు చెందిన గోనె సుశీల గతనెల 27న కరోనా మృతి చెందింది. ఆదివారం ఆమె పెద్దకొడుకు గోనెకృష్ణ మృతి చెందగా, ఆయన చనిపోయిన గంటల్లోనే కృష్ణ సోదరుడు శ్రీనివాస్ ప్రాణాలు కోల్పోయాడు. అటు నెల్లికుదురు మండల కేంద్రంలో కరోనాతో ఒకే కుటుంబంలో తండ్రీ,కొడుకులు మృత్యువాతపడ్డారు. ఒక రోజు వ్యవధిలోనే తండ్రీకొడుకులు మృతి చెందడంతో గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. 

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.