Warangal Declaration చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుంది: రాహుల్

ABN , First Publish Date - 2022-05-07T01:17:40+05:30 IST

రైతు సంఘర్షణ సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఎందరో త్యాగంతో ఏర్పడిందని, ఏ ఒక్కరితోనో తెలంగాణ ఏర్పడలేదని గుర్తుచేశారు

Warangal Declaration చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుంది: రాహుల్

వరంగల్: Warangal Declaration చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుందని కాంగ్రెస్ అగ్రనేత Rahul Gandhi అన్నారు. రైతు సంఘర్షణ సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఎందరో త్యాగంతో ఏర్పడిందని, ఏ ఒక్కరితోనో తెలంగాణ ఏర్పడలేదని గుర్తుచేశారు. రాబోయే కాలంలో అందరూ సుభిక్షంగా ఉండడానికి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని తెలిపారు. టీఆర్ఎస్ పరిపాలనలో పూర్తిగా విఫలమైందని తప్పుబట్టారు. మనం ఊహించిన విధంగా తెలంగాణలో మార్పు రాలేదని, తెలంగాణలో కేవలం ఒక కుటుంబానికే మేలు జరుగుతోందని విమర్శించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవని, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబ సభ్యుల ఎందరో ఇక్కడ ఉన్నారని తెలిపారు. ప్రతి రోజు నిరాశతో ఎందరో తెలంగాణలో ఆత్మహత్య చేసుకుంటున్నారని,  దీనికి ఎవరు సమాధానం చెబుతారని Rahul Gandhi ప్రశ్నించారు.

Read more