దేదీప్యమానం... వరంగల్‌ కలెక్టరేట్‌ సముదాయం

Jun 16 2021 @ 23:14PM

వరంగల్‌ అర్బన్‌ జిల్లా నూతన కలెక్టరేట్‌ సముదాయం ప్రారంభానికి ముస్తాబైంది. ఈ నెల 21వ తేదీన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును భవనాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఇప్పటికే మంత్రి దయాకర్‌రావు, కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు, తదితరులు భవనాన్ని మంగళవారం పరిశీలించారు. ఇదిలా వుండగా, బుధవారం రాత్రి నూతన కలెక్టరేట్‌ భవన సముదాయంలో విద్యుత్‌ లైట్లను వేశారు. దీంతో ప్రాంగణమంతా దేదీప్యమానంగా వెలుగొందింది. నగరవాసులను ఆకట్టుకుంది. 

- ఫొటోలు : స్టాఫ్‌ ఫొటోగాఫ్రర్‌, 

ఆంధ్రజ్యోతి/వరంగల్‌ అర్బన్‌Follow Us on: