
వరంగల్: జిల్లాలోని సంగెం మండలంలోని నార్లవాయి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. భర్త చనిపోయాడని తెలుసుకున్న 10 నిమిషాలకే భార్య కూడా మరణించింది. అనారోగ్యంతో భర్త బూర కట్టయ్య (75 )మృతి విషయం తెలుసుకున్న కమలమ్మ (65) గుండెపోటుతో మరణించింది. మృతి చెందిన వృద్ద దంపతులకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్యాభర్తలు దాదాపుగా ఒకేసారి మరణించడంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.
ఇవి కూడా చదవండి