కొవిడ్ ఆసుపత్రిలో మహిళపై వార్డు బాయ్ లైంగిక వేధింపులు...అరెస్ట్

ABN , First Publish Date - 2021-05-13T16:53:06+05:30 IST

కొవిడ్ ఆసుపత్రిలో రోగి వెంట వచ్చిన ఓ మహిళను వార్డుబాయ్ లైంగికంగా వేధించిన ఘటన బీహార్

కొవిడ్ ఆసుపత్రిలో మహిళపై వార్డు బాయ్ లైంగిక వేధింపులు...అరెస్ట్

భాగల్‌పూర్ (బీహార్): కొవిడ్ ఆసుపత్రిలో రోగి వెంట వచ్చిన ఓ మహిళను వార్డుబాయ్ లైంగికంగా వేధించిన ఘటన బీహార్ రాష్ట్రంలోని భాగల్ పూర్ పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రిలో వెలుగుచూసింది.తన భర్తకు, తల్లికి కరోనా సోకడంతో వారికి చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చి వారి బాగోగులు చూసేందుకు వివాహిత వచ్చింది. ఆసుపత్రిలో వార్డు బాయ్ గా పనిచేస్తున్న జ్యోతికుమార్ వివాహితను లైంగికంగా వేధించాడు.దీంతో వార్డు బాయ్ లైంగిక వేధింపులపై సోషల్ మీడియాలో పోస్టుతో వెలుగుచూసింది. దీంతో పత్రాకార్ నగర్ పోలీసులు జ్యోతికుమార్ పై కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్టు చేశారు.మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరంలోని మహారాజా యశ్వంతరావు ఆసుపత్రిలో ఇద్దరు వార్డుబాయ్ లు కరోనా మహిళా రోగిని లైంగికంగా వేధించారు. కరోనా మహమ్మారి కాలంలో మహిళలపై లైంగిక వేధింపులు పెరిగాయి.

Updated Date - 2021-05-13T16:53:06+05:30 IST