మార్కెట్ నుంచి వస్తున్న మహిళకు లిఫ్ట్ ఇచ్చాడు.. ఊరికి దూరంగా తీసుకెళ్లాడు.. తర్వాతి రోజు చూస్తే..

ABN , First Publish Date - 2021-11-24T17:06:01+05:30 IST

ఆమె తన తల్లితో కలిసి మార్కెట్ నుంచి ఇంటికి బయల్దేరింది.. సగం దూరం వెళ్లేసరికి ఓ వ్యక్తి బైక్ మీద వచ్చి లిఫ్ట్ ఇస్తానన్నాడు.

మార్కెట్ నుంచి వస్తున్న మహిళకు లిఫ్ట్ ఇచ్చాడు.. ఊరికి దూరంగా తీసుకెళ్లాడు.. తర్వాతి రోజు చూస్తే..

ఆమె తన తల్లితో కలిసి మార్కెట్ నుంచి ఇంటికి బయల్దేరింది.. సగం దూరం వెళ్లేసరికి ఓ వ్యక్తి బైక్ మీద వచ్చి లిఫ్ట్ ఇస్తానన్నాడు.. తెలిసిన వాడు కావడంతో తల్లీకూతుళ్లు ఇద్దరూ ఆ బైక్ ఎక్కారు.. కొంతదూరం వెళ్లాక ముగ్గురికీ సరిపోవడం లేదని చెప్పి కూతుర్ని దించేశాడు.. అమ్మను ఇంటి దగ్గర దించేసి మళ్లీ వచ్చి తీసుకెళ్తనన్నాడు.. చెప్పినట్టుగానే తల్లిని దించేసి వచ్చి యువతిని బైక్ ఎక్కించుకుని ఊరవతలకు తీసుకెళ్లాడు.. రాత్రయినా కూతురు ఇంటికి రాకపోవడంతో తల్లి కంగారుపడింది.. తర్వాతి రోజు ఉదయం ఓ మురికి కాలవ పైప్‌లో కూతురి మృతదేహం కనిపించింది.. రాజస్థాన్‌లోని కోట ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. 


కోటకు చెందిన మన్మార్ బాయి అనే మహిళ మూడేళ్ల క్రితం యోగేంద్ర అనే యువకుడిని వివాహం చేసుకుంది. రోజు కూలీగా పనిచేసే యోగేంద్రతో పడకపోవడంతో మన్మార్ గత ఏడాదిన్నరగా తన పుట్టింట్లోనే ఉంటోంది. యోగేంద్ర ఎంతగా పిలిచినా అతడి వద్దకు వెళ్లలేదు. సోమవారం సాయంత్రం మన్మార్ తన తల్లితో కలిసి మార్కెట్‌కు వెళ్లింది. షాపింగ్ పూర్తయి ఇంటికి వెళ్తున్న సమయంలో ఓ వ్యక్తి బైక్ మీద వచ్చి లిఫ్ట్ ఇస్తానన్నాడు. అతను తెలిసిన వ్యక్తే కావడంతో ఇద్దరూ బైక్ ఎక్కారు. కొద్ది దూరం వెళ్లాక మన్మార్‌ను దించేసి ఆమె తల్లిని ఇంటికి డ్రాప్ చేశాడు. 


అనంతరం మన్మార్ కోసం వచ్చి ఆమెను బైక్ ఎక్కించుకున్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది మిస్టరీగా మారింది. మన్మార్ ఎంతకీ ఇంటికి రాకపోవడంతో ఆమె సోదరుడు సోమవారం రాత్రి పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాడు. తర్వాతి రోజు ఉదయమే ఆమె మృతదేహం మురికి నీరు ప్రవహించే పైప్‌లో కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్‌మార్ట‌మ్‌కు తరలించారు. మన్మార్‌కు లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తి గురించి పోలీసులు అన్వేషణ సాగిస్తున్నారు. 

Updated Date - 2021-11-24T17:06:01+05:30 IST