27 రాష్ట్రాలపై క్వారంటైన్ ఆంక్షలు విధించిన వాషింగ్టన్ డీసీ

ABN , First Publish Date - 2020-07-28T23:39:47+05:30 IST

అమెరికా వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వాషింగ్టన్ నగర

27 రాష్ట్రాలపై క్వారంటైన్ ఆంక్షలు విధించిన వాషింగ్టన్ డీసీ

వాషింగ్టన్: అమెరికా వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వాషింగ్టన్ నగర హెల్త్ ఏజెన్సీ నియంత్రణ చర్యలు తీసుకుంటోంది. ఈ చర్యల్లో భాగంగా 27 రాష్ట్రాల నుంచి వాషింగ్టన్ నగరానికి వచ్చే వారు 14 రోజుల పాటు క్వారంటైన్‌లో తప్పనిసరిగా ఉండాలని వెల్లడించింది. సోమవారం నుంచే ఈ ఆంక్షలు అమల్లోకి వచ్చినట్టు అధికారులు తెలిపారు. గడిచిన 14 రోజుల్లో అత్యధిక కరోనా కేసులు నమోదైన రాష్ట్రాలపై ఈ ఆంక్షలు కొనసాగనున్నాయి. ముఖ్యంగా కాలిఫోర్నియా, ఫ్లోరిడా, నార్త్ కెరోలినా, సౌత్ కెరోలినా, టెక్సాస్, వాషింగ్టన్, జార్జియా, డెలవేర్ రాష్ట్రాలపై ఆంక్షలు తప్పనిసరిగా ఉండనున్నాయి. ఎందుకంటే.. ఈ రాష్ట్రాల్లో నిత్యం అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. కాగా.. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు అమెరికాలోనే నమోదైన విషయం తెలిసిందే. అమెరికాలో ఇప్పటివరకు 4,434,185 కేసులు నమోదుకాగా.. కరోనా కారణంగా 150,500 మంది మృత్యువాతపడ్డారు. 

Updated Date - 2020-07-28T23:39:47+05:30 IST