Asia Cup : ఆ భారత ఆటగాడు బహు ప్రమాదకారి: పాక్ మాజీ దిగ్గజం వసీం అక్రమ్.. ఎవరో తెలుసా.. రోహిత్, కోహ్లీ కాదు..

ABN , First Publish Date - 2022-08-24T01:09:28+05:30 IST

ఆసియా కప్-2022(Asia Cup) భాగంగా భారత్ వర్సెస్ పాకిస్తాన్ (India Vs Pakistan) నేపథ్యంలో పాక్ మాజీ క్రికెట్ దిగ్గజం వసీం అక్రమ్ (Wasim Akram) ఆసక్తికరంగా స్పందించాడు. స్టార్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ టీమిండియాకి

Asia Cup : ఆ భారత ఆటగాడు బహు ప్రమాదకారి: పాక్ మాజీ దిగ్గజం వసీం అక్రమ్.. ఎవరో తెలుసా.. రోహిత్, కోహ్లీ కాదు..

ఇస్లామాబాద్ : ఆసియా కప్-2022(Asia Cup) భాగంగా ఈ నెల 28న భారత్ వర్సెస్ పాకిస్తాన్ (India Vs Pakistan) మ్యాచ్ నేపథ్యంలో పాక్ మాజీ క్రికెట్ దిగ్గజం వసీం అక్రమ్ (Wasim Akram) ఆసక్తికరంగా స్పందించాడు. స్టార్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ (Surya Kumar yadav) టీమిండియాకి అత్యంత కీలకం మారనున్నాడని పేర్కొన్నాడు. ఆసియా కప్‌(Asia Cup)లో పాకిస్తాన్‌ను దెబ్బకొట్టగల సామర్థ్యం అతడికి ఉందని పాక్ ఆటగాళ్లను హెచ్చరించాడు. భారత జట్టు(Team India)లో రోహిత్ శర్మ(Rohit Sharma), కేఎల్ రాహుల్(KL Rahul), విరాట్ కోహ్లీ(Virat Kohli) వంటి స్టార్ బ్యాట్స్‌మెన్లు ఉన్నప్పటికీ తన ఫేవరెట్ ఆటగాడు మాత్రం సూర్యకుమార్ యాదవేనని వసీం అక్రమ్ పేర్కొన్నాడు. ఇటివల అతడు అద్భుతంగా రాణిస్తున్నాడని ప్రశంసించాడు. సూర్యకుమార్ యాదవ్ భారత జట్టులో ఆడుతుండడంతో చూడడానికి కనుల విందుగా ఉందని అక్రమ్ వ్యాఖ్యానించాడు. స్పిన్‌, ఫాస్ట్ బౌలింగ్‌ విషయంలో అతడు ప్రమాదకరమైన ఆటగాడని, ఒక్కసారి క్రీజులో కుదురుకుంటే 360 డిగ్రీల్లో షాట్లు కొట్టగలని పాక్ బౌలర్లను హెచ్చరించాడు. సూర్యకుమార్ యాదవ్ ఒక్క పాకిస్తాన్‌కే కాదు.. అన్నీ జట్లకూ ప్రమాదకారేనని పేర్కొన్నాడు. స్టార్‌స్పోర్ట్స్ నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో వసీం అక్రమ్ ఈ విధంగా స్పందించాడు. 


సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్‌లో తన తొలి ఏడాది కోల్‌కతా నైట్‌రైడర్స్‌(Kolcutta Knight Rider)కు ఆడినప్పుడు అతడిని గమనించానని అక్రమ్ ప్రస్తావించాడు. 2 మ్యాచ్‌లు ఆడగా బ్యాటింగ్‌ ఆర్డర్‌లో నెం 7, నెం 8 స్థానాల్లో బ్యాటింగ్‌కి దిగాడని గుర్తుచేశాడు. ఫైన్ లెగ్‌లో పలు క్లిష్టమైన షాట్లు అద్భుతంగా ఆడాడని మెచ్చుకున్నాడు.


కాగా ఇప్పటివరకు మొత్తం 23 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడిన సూర్యకుమార్ యాదవ్ 37.33 సగటుతో మొత్తం 682 పరుగులు కొట్టాడు. ఇందులో 2 అర్ధ సెంచరీలు, ఒక సెంచరీ ఉంది. ఇంగ్లాండ్‌పై ఓవల్‌లో జరిగిన మ్యాచ్‌లో ఈ 117 పరుగుల సెంచరీ బాదిన విషయం తెలిసిందే. కాగా ఆసియా కప్‌లో భాగంగా ఆగస్టు 28న భారత్ - పాకిస్తాన్ తలపడనున్నాయి. యూఏఈ వేదికగా ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 11 వరకు ఈ టోర్నీ కొనసాగనుంది.

Updated Date - 2022-08-24T01:09:28+05:30 IST