ఫొటోగ్రాఫర్‌పై పగపట్టిన పాము.. తరిమితరిమి కొట్టింది.. వీడియో చూస్తే వామ్మో.. అనాల్సిందే

ABN , First Publish Date - 2022-02-17T02:37:17+05:30 IST

ఏ పాము అయినా మనిషి చప్పుడు వినగానే ఆమడ దూరం పరుగెడుతూ ఉంటుంది. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో మాత్రం ఓ పాము మరీ విచిత్రంగా ఉన్నట్టుంది. ఫొటో తీస్తున్న వ్యక్తిని తరిమి తరిమి కొట్టింది..

ఫొటోగ్రాఫర్‌పై పగపట్టిన పాము.. తరిమితరిమి కొట్టింది.. వీడియో చూస్తే వామ్మో.. అనాల్సిందే

పాములు పగబడతాయి అంటారు గానీ.. అది ఎంత వరకు నిజమో ఎవరికీ తెలీదు. సాధారణంగా వాటి జోలికి వెళ్తేనే అవి దాడి చేయడం జరుగుతూ ఉంటుంది. ఏ పాము అయినా మనిషి చప్పుడు వినగానే ఆమడ దూరం పరుగెడుతూ ఉంటుంది. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో మాత్రం ఓ పాము మరీ విచిత్రంగా ఉన్నట్టుంది. ఫొటో తీస్తున్న వ్యక్తిని తరిమి తరిమి కొట్టింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు.


ఇన్‌స్టాగ్రాంలో ఓ వీడియో వైరల్ అవుతోంది. అడవిలో ఓ వ్యక్తి ఫొటోలు తీస్తూ ఉంటాడు. ఈ క్రమంలో అతడికి ఓ పాము కనిపిస్తుంది. దీంతో దాన్ని తన కెమెరాలో బంధించేందుకు ప్రయత్నిస్తాడు. ఇతన్ని చూడగానే పాముకు చిర్రెత్తుకొచ్చినట్లుంది. నన్నే ఫొటో తీస్తావా.. అన్నట్లుగా ఒక్కసారిగా అతడిపై విరుచుకుపడుతుంది. దీంతో ఆ ఫొటోగ్రాఫర్ పరుగుందుకుంటాడు. ఈ క్రమంలో కాలు జారి కిందపడడం మనం చూడొచ్చు. వెంటనే పైకి లేచి బతుకుజీవుడా అంటూ మళ్లీ పరుగు మొదలెడతాడు. కానీ పాము మాత్రం బుసలు కొడుతూ అతన్ని వెంటాడుతుంది. ఎలాగోలా దాని నుంచి బయటపడ్డ అతను.. అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరూ ఓ లుక్కేయండి మరి.

ఏనుగు బొమ్మను ఏనుగే వేయడం ఎప్పుడైనా చూశారా.. అవాక్కవుతున్న నెటిజన్లు..



Updated Date - 2022-02-17T02:37:17+05:30 IST