నీళ్లపై 12గంటల పద్మాసనం

ABN , First Publish Date - 2022-04-05T16:16:03+05:30 IST

స్థానిక మాధవరం పాల డిపో సమీపంలోని స్విమ్మింగ్‌ ఫూల్‌లో 12 గంటలు పద్మాసనం వేసిన విద్యార్థి అందరి ప్రశంసలు అందుకున్నాడు. నందియంబాక్కంకు చెందిన

నీళ్లపై 12గంటల పద్మాసనం

                    - ఏడో తరగతి విద్యార్థి సాధన


పెరంబూర్‌(చెన్నై): స్థానిక మాధవరం పాల డిపో సమీపంలోని స్విమ్మింగ్‌ ఫూల్‌లో 12 గంటలు పద్మాసనం వేసిన విద్యార్థి అందరి ప్రశంసలు అందుకున్నాడు. నందియంబాక్కంకు చెందిన రాహుల్‌ అదే ప్రాంతంలోని ప్రైవేటు పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. యోగా శిక్షణ పొందుతున్న రాహుల్‌ మూలసత్రం ప్రాంతంలోని రిక్రియేషన్‌ క్లబ్‌కు చెందిన స్విమ్మింగ్‌ ఫూల్‌లో ఆదివారం తెల్లవారుజామున 5 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నీటిపై పద్మాసనం వేసి సాధన చేశాడు. విద్యార్థిని పలువురు అభినందించారు.

Updated Date - 2022-04-05T16:16:03+05:30 IST