మైలవరానికి 2వేల క్యూసెక్కులు విడుదల

ABN , First Publish Date - 2020-11-30T05:01:57+05:30 IST

గండికోట ప్రాజెక్టు నుంచి మైలవరం జలాశయానికి 2వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్లు జీఎన్‌ఎ్‌సఎ్‌స ఈఈ రామాంజనేయులు తెలిపారు.

మైలవరానికి 2వేల క్యూసెక్కులు విడుదల

కొండాపురం, నవంబరు 29: గండికోట ప్రాజెక్టు నుంచి మైలవరం జలాశయానికి 2వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్లు జీఎన్‌ఎ్‌సఎ్‌స ఈఈ రామాంజనేయులు తెలిపారు. జీఎన్‌ఎ్‌సఎ్‌స మెయిన్‌ కెనాల్‌ ద్వారా 500క్యూసెక్కులు, క్యాచ్‌మెంట్‌ ద్వారా 2700క్యూసెక్కులు ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో ఉన్నట్లు ఈఈ తెలిపారు. కాగా ప్రస్తుతం గండికోట ప్రాజెక్టులో 19.3టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ తెలిపారు.  నీటిమట్టం పెరుగుతుండడంతో కొండాపురంలోకి వచ్చే ప్రధాన రహదారి, చామలూరు, ఎర్రగుడి గ్రామాలకు రాకపోకలు బంద్‌ అయ్యాయి. వెంటనే నీటిమట్టం తగ్గించాలని నిర్వాసితులు కోరుతున్నారు. 


Updated Date - 2020-11-30T05:01:57+05:30 IST