పెద్ద చెరువుకు జలకళను సంతరింపజేయాలి

ABN , First Publish Date - 2021-04-16T05:30:00+05:30 IST

మండల కేంద్రంలోని పెద్దచెరువుకు జలకళను సంతరింప జేయాలని ప్రజాప్రతినిధులను అఖిలప క్ష నాయకులు కోరారు.

పెద్ద చెరువుకు జలకళను సంతరింపజేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న అఖిలపక్ష నాయకులు

బీబీపేట, ఏప్రిల్‌ 16: మండల కేంద్రంలోని పెద్దచెరువుకు జలకళను సంతరింప జేయాలని ప్రజాప్రతినిధులను అఖిలప క్ష నాయకులు కోరారు. శుక్రవారం బీబీపేటలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గతంలో చెరు వు కింద భూములలో తమలపాలకులను పండించి, నిజాం ప్రభువులకు, విజయవాడ, విశాఖపట్నం, నల్లగొండ, మహ బూబ్‌నగర్‌ లాంటి ప్రాంతాలకు ఎగుమతి చేసేవారని అన్నా రు. ప్రస్తుతం చెరువులో నీరు లేక పొలాలు బీడు భూములు గా మారాయన్నారు. ఈ చెరువు నింపడానికి ఉన్న ప్రధాన కాలువ ఎడ్లకట్టవాగు ఈ వాగు మెదక్‌ జిల్లా దంతేపల్లి వద్ద ప్రారంభమై బీబీపేట పెద్దచెరువును నింపేదని తెలిపారు. ఈ వాగుపై పలుచోట్ల కట్టిన నిర్మాణాల వల్ల నీరు రావడం లేద న్నారు. అనేక ఉద్యమాలు, పాదయాత్రలు చేసినప్పటికీ నేటి వరకు ఈ చెరువును నింపే ప్రయత్నాలు జరగలేదని అన్నా రు. భవిష్యత్తు తరాలకు సాగు, తాగునీరు,  భూగర్భ జలాల ను పెంచడానికి ఈ చెరువును నింపాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. యువకులు, రైతులు ముందుకు వచ్చి ఉద్యమించడం గొప్ప విషయమని జలసాధన సమితి కన్వీనర్‌ వెంకట్‌ రాంరెడ్డి తెలిపారు. అనంతరం చెరువుకు నీరు వచ్చే అంశంపై పవర్‌ప్లాంట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. ఎడ్లగట్ట వాగుపై ఉన్న ఆరేపల్లి వద్ద ఉన్న గోడ వంటి నిర్మాణాన్ని తొలగించాలని, కాళేశ్వరం నుంచి కూడేల్లి వాగు ద్వారా ఎగువ మానేరుకు వచ్చే నీరుకు, యాడారం వద్ద ఉన్న ఢీ ఫ్లోరైడ్‌ పథకాన్ని అను సంధానం చేసి మోటార్లు బిగించి ఎత్తిపోతల ద్వారా పెద్ద చెరువుకు నీరు అందించాలని, కొండపోచమ్మ నుంచి నిజాం సాగర్‌ ప్రాజెక్ట్‌కు నీటిని తరలించే క్రమంలో మెదక్‌ జిల్లా అవుసులపల్లి వద్ద నుంచి 10కి.మీ మేర మార్గం తవ్వించి ఎడ్లకట్ట వాగుకు అనుసంధానం చేస్తే పెద్దచెరువు నిండుతుం దని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు దుంప నర్సింలు, ఆముదాల నరేందర్‌, రాము గౌడ్‌, శివ, మల్లేషం, కాంగ్రెస్‌ నాయకులు భూమాగౌడ్‌, సుతారి రమేష్‌, విద్యార్థి నాయకులు సంతోష్‌గౌడ్‌, రైతులు, యువకులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-16T05:30:00+05:30 IST