శ్రీరామసాగర్‌కు జలకళ

ABN , First Publish Date - 2022-06-24T06:53:48+05:30 IST

ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయిని అయిన శ్రీరామసాగర్‌ ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులోకి స్వల్ప వరద వచ్చి చేరుతోందని ప్రాజెక్టు ఎస్‌ఈ శ్రీనివాస్‌, ఈఈ చక్రపాణి తెలిపారు. గురువారం ప్రాజెక్టులోకి 4514 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరిందన్నారు.

శ్రీరామసాగర్‌కు జలకళ

మెండోర, జూన్‌ 23: ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయిని అయిన శ్రీరామసాగర్‌ ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులోకి స్వల్ప వరద వచ్చి చేరుతోందని ప్రాజెక్టు ఎస్‌ఈ శ్రీనివాస్‌, ఈఈ చక్రపాణి తెలిపారు. గురువారం ప్రాజెక్టులోకి 4514 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరిందన్నారు. ప్రాజెక్టు నుంచి ఎస్కేప్‌ గేట్ల ద్వారా 50 క్యూసెక్కులు, కాకతీయ కాలువకు 50 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 367 క్యూసెక్కులు, మిషన్‌ భగీరథ తాగునీటి కోసం 152 క్యూసెక్కులు ఔట్‌ఫ్లో పోతుందని వివరించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు (90టీఎంసీ)లు కాగా, గురువారం సాయంత్రానికి 1065.6 అడుగులు (21.233టీఎంసీ)ల నీటి నిల్వ ఉందని, గత ఏడాది ఇదే రోజు 1067.8 అడుగులు (24.954టీఎంసీ)ల నీటి నిల్వ ఉందని, జూన్‌1వ తేదీ నుంచి ప్రాజెక్టులోకి 2.432టీఎంసీల నీరు వచ్చిచేరిందని తెలిపారు. 

Updated Date - 2022-06-24T06:53:48+05:30 IST