చెక్‌డ్యాంల నిర్మాణంతో జలకళ

ABN , First Publish Date - 2022-05-16T06:44:57+05:30 IST

చెక్‌ఢ్యాంల నిర్మాణంతో బీడు భూములు స్యస్యశ్యా మల మవుతున్నాయనిజలకళను సంతరించుకున్నాయని జగిత్యాల ఎమ్మె ల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ అన్నారు.

చెక్‌డ్యాంల నిర్మాణంతో జలకళ
చెక్‌డ్యాం పరిశీలిస్తున్న ఎమ్మెల్యే

ఫఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌

రాయికల్‌, మే 15: చెక్‌ఢ్యాంల నిర్మాణంతో బీడు భూములు స్యస్యశ్యా మల మవుతున్నాయనిజలకళను సంతరించుకున్నాయని జగిత్యాల ఎమ్మె ల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ అన్నారు. మండలంలోని బోర్నపెల్లి, కొత్తపేట గ్రామాలలో నిర్మిస్తున్న చెక్‌డ్యాంలను ఆదివారం ఆయన పరిశీలించారు. బోర్నపెల్లి గ్రామంలో చెక్‌డ్యాంలో ఎమ్మెల్యే నాయకులతో కలిసి జలకాలా డారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులకు సాగునీరందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు అనేక కార్యక్రమాలు చేపట్టారని ప్రతీ నీటి బొట్టును ఒడిసి పట్టే విధంగా రైతుల నష్టపోకుండా చెక్‌డ్యాంలను నిర్మిం చి భూగర్భ జలమట్టం పెరగడానికి, నీటి వసతి ఏర్పడటానికి కృషి చేశా రని అన్నారు. నిండు వేసవిలో చెరువులు మత్తడి పారుతున్నాయని అ న్నారు. ప్రతి విషయానికీ ప్రతిపక్షాలు విమర్శించడమే ధ్యేయంగా పెట్టుకున్నారని అన్నారు. డీ52 కెనాల్‌కు తొంబర్రావుపేట వద్ద తూము ఏర్పా టు చేయడం ద్వారా తొంబర్రావుపేట, పోరుమల్ల, రాయికల్‌, చెర్లకొండా పూర్‌ తదితర 14గ్రామాలకు నీటి వసతి ఏర్పడిందని అన్నారు. ఈకార్యక్ర మంలో జడ్పీటీసీ జాదవ్‌అశ్విని, మున్సిపల్‌ చైర్మన్‌ మోర హన్మాండ్లు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-16T06:44:57+05:30 IST