పంట పొలాల్లో నీలి రంగు నీరు... వణికిపోతున్న రైతులు!

ABN , First Publish Date - 2021-08-11T17:42:12+05:30 IST

మహారాష్ట్రలోని కల్యాణ్ జిల్లాలోని...

పంట పొలాల్లో నీలి రంగు నీరు... వణికిపోతున్న రైతులు!

కల్యాణ్: మహారాష్ట్రలోని కల్యాణ్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో నీలి రంగు నీరు దర్శనమిస్తోంది. రోడ్లపై నిలిచే నీటితో పాటు పంటపొలాల్లోని నీరు కూడా నీలంగా కనిపిస్తోంది. దీనిని కారణం తెలియక అక్కడి ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాంతానికి ఏదో ప్రమాదం పొంచివుందని వారు భయపడుతున్నారు. కల్యాణ్ ప్రాంతంలోని 14 గ్రామాల్లోకి పరిశ్రమల రసాయన వ్యర్థ జలాలను భారీ స్థాయిలో విడిచిపెడుతున్నారు. ఈ నీరు గ్రామాల్లోని రోడ్లపై కూడా ప్రవహిస్తోంది. ఇక పంటపొలాల సంగతి చెప్పనవసరం లేదు. ఈ సమస్యపై స్థానిక రైతులు కాలుష్య నియంత్రణ మండిలికి ఫిర్యాదు చేయడంతోపాటు, వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు. అయితే కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఇంతవరకూ ఈ గ్రామాలను సందర్శించకపోవడంపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.



Updated Date - 2021-08-11T17:42:12+05:30 IST