కేజీబీవీ విద్యార్థులకు నీటి కష్టాలు

ABN , First Publish Date - 2021-03-01T05:21:21+05:30 IST

ప్రభుత్వ వసతి గృహాల్లోని విద్యార్థులకు మెరుగైన వసతులను కల్పిస్తున్నామని చెప్పుకొంటున్న ప్రభుత్వం, అధికారులు, ప్రజాప్రతినిధులు ఆచరణలో పెట్టడం లేదని తెలుస్తోంది. దీనికి అల్లాదుర్గంలోని కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినులు ఎదుర్కొంటున్న కష్టాలే సాక్షం.

కేజీబీవీ విద్యార్థులకు నీటి కష్టాలు
సమీప కాలనీలోని చేతిపంపు నుంచి నీటిని తోడుకుంటున్న విద్యార్థులు

 బోరు చెడిపోవడంతో సమీప కాలనీ నుంచి నీటిని తెచ్చుకుంటున్న వైనం

 పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు


అల్లాదుర్గం, ఫిబ్రవరి 28: ప్రభుత్వ వసతి గృహాల్లోని విద్యార్థులకు మెరుగైన వసతులను కల్పిస్తున్నామని చెప్పుకొంటున్న ప్రభుత్వం, అధికారులు, ప్రజాప్రతినిధులు ఆచరణలో పెట్టడం లేదని తెలుస్తోంది. దీనికి అల్లాదుర్గంలోని కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినులు ఎదుర్కొంటున్న కష్టాలే సాక్షం. కస్తూర్భాగాంధీ విద్యాలయంలోని బోరు చెడిపోవడంతో నీటి సమస్య తలెత్తింది. మరమ్మతులు చేపట్టి వినియోగంలోకి తేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా విద్యార్థుల అవసరాలకు నీటిని సమకూర్చాల్సి ఉన్నా విద్యాలయ ప్రత్యేక అధికారి, సిబ్బంది పట్టించుకోవడం లేదు. దీంతో విద్యార్థులే సమీపంలోని ఓ కాలనీలో చేతిపంపు నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు. ఆదివారం విద్యార్థుల తల్లిదుండ్రలు కొందరు తమ పిల్లలను చూసేందుకు వచ్చి విద్యార్థుల నీటి కష్టాలను గమనించి ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాలయంలో నెలకొన్న నీటి సమస్యను పరిష్కరించకుండా పిల్లలతోనే నీటిని మోపించడం ఏమిటని, విద్యాలయ సిబ్బంది ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


Updated Date - 2021-03-01T05:21:21+05:30 IST