ఆ ఊరిలో నీటి కష్టాలు

ABN , First Publish Date - 2021-04-17T04:39:34+05:30 IST

మండలంలోని హొన్నూర్‌ గ్రామంలో నీటి కష్టాలు తప్పడం లేదు.

ఆ ఊరిలో నీటి కష్టాలు
హొన్నూర్‌లో నీటి కోసం ఎదురు చూస్తున్న గ్రామస్థులు

 హొళగుంద, ఏప్రిల్‌ 16: మండలంలోని హొన్నూర్‌ గ్రామంలో నీటి కష్టాలు తప్పడం లేదు. కిలోమీటర్ల దూరంలోని పొలాల్లోని బోరు బావుల వద్దకు వెళ్లి నీరు తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐదు రోజులకు ఒకసారి గంట వ్యవధి మాత్రమే కొళాయిలకు నీటి సరఫరా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు గ్రామాల వైపు చూడడం లేదని పలువురు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నీటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

Updated Date - 2021-04-17T04:39:34+05:30 IST