చినమిల్లిపాడులో నిరుపయోగంగా ఫిల్టర్‌బెడ్
చినమిల్లిపాడులో పనిచేయని ఫిల్టర్‌బెడ్..
కలుషిత నీరే సరఫరా
ఆకివీడురూరల్, మార్చి 27 : అది ఒక చిన్న కొల్లేరు గ్రామం..అక్కడ చెరువు నీరే ఆధారం.. అయినా అధి కారులకు పట్టదు.. నాయకులకు పట్టదు.. ఎటువంటి ఫిల్టర్ చేయకుండానే నీటిని సరఫరా చేసేస్తున్నా రు. అదే నీటిని తాగి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. అదే ఆకివీడు మండలంలోని చినిమిల్లిపాడు.. సుమారు 2 వేల జనాభా కలిగిన గ్రామంలో రెండెకరాల మంచినీటి చెరువు, మంచి నీటి పథకం ఉన్నాయి. అయితే సుమారు 8 నెలలుగా గ్రామంలోని ఫిల్టర్బెడ్లు పనిచేయడం లేదు. దీంతో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో తాగునీరే ప్రధాన ఎజెండా పోటీపడ్డారు. నూతన పాలకవర్గం వచ్చినప్పటికి ఇప్పటి వరకు అటువైపే చూడలేదు. కాలువ శివారు ప్రాంతం కావడంతో కలుషిత నీటినే చెరువులో నింపి సరఫరా చేస్తున్నారు. దీనిపై అదే గ్రామానికి చెందిన నత్తా లక్ష్మీకాంత మాట్లాడుతూ ఫిల్టర్బెడ్లు పనిచేయడం లేదు.అధికారులు, పాలకవర్గం సమాధానమే చెప్పడం లేదు. ఇచ్చిన నీరే తాగండి అంటున్నారు. ఆనీరు వాడకానికి కూడా పనికి రావడం లేదని వాపోయింది..