వాటర్‌ రెసిస్టెంట్‌ఫోన్లు

ABN , First Publish Date - 2021-04-03T06:07:21+05:30 IST

నీళ్ళలో చిందులంటే చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళవరకు అందరికీ సరదా. అందులో వింతేమీ లేదు. హోలీ కాదంటే

వాటర్‌ రెసిస్టెంట్‌ఫోన్లు

నీళ్ళలో చిందులంటే చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళవరకు అందరికీ సరదా. అందులో వింతేమీ లేదు. హోలీ కాదంటే జలపాతం, నది, సముద్రం ఎక్కడైనా నీటితో ఆటలాడే అవకాశం ఉంటుంది. ఈ తరంలో అదనపు ఆకర్షణ ఫొటోలు. ప్రతి వ్యక్తి చేతికి నిండుదనం సెల్‌. అందులో నుంచి క్లిక్‌ మనిపించడంలో కిక్కే వేరు. అయితే ప్రమాదవశాత్తు చేతిలో ఉన్న  సెల్‌ నీటిలో పడితే, పూర్తిగా తడిసిపోతే నష్టం ఆ ఫోన్‌ పోవడానికే పరిమితం కాదు. అందులో ఉంచుకున్న డేటా పోతుంది. వేరే చోట సేవ్‌ చేసుకోనిపక్షంలో యావత్తు డేటా నీటిపాలైనట్టే.


అలా పోయిన వాటిలో తీపి జ్ఞాపకాలు ఉండొచ్చు, పిల్లల చిన్నప్పటి ముద్దు మాటల వీడియోలు కావచ్చు, ముఖ్యమైన డాక్యుమెంట్లూ కావచ్చు. పోయిన కాలం మాదిరిగానే అవీ తిరిగిరావు. అయితే ఈ మధ్య కాలంలో నీటి ముప్పున పడకుండా నిలదొక్కుకోగల ఫోన్లు  వస్తున్నాయి.  బకెట్లో లేదంటే మరో చోట నీటిలో పడినప్పటికీ డ్యామేజ్‌కి లోనుకాని ఫోన్లు ఇప్పుడు ఉన్నాయి. అవేంటో చూద్దాం. ఈ జాబితాలో అధికారిక ఐపి రేటింగ్‌ లేని ఫోన్లను చేర్చలేదు. 




శాంసంగ్‌ గెలాక్సీ ఎ52  (రేటు రూ.26,499 నుంచి)

ఐపి67 రేటింగ్‌ కలిగిన ఈ ఫోన్‌ పూర్తిగా వాటర్‌ రెసిస్టెంట్‌. ఇటీవలే విడుదల చేసిన ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 11 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఆక్టా-కోర్‌ క్వాల్కామ్‌ స్నాఫ్‌ డ్రాగన్‌ 720జి ప్రాసెసర్‌ కలిగి ఉంది. 



ఒన్‌ప్లస్‌ 8 ప్రొ (రూ.54,999 నుంచి)

ఒన్‌ ప్లస్‌ నుంచి వచ్చిన పవర్‌ఫుల్‌ ఫోన్‌ 2920. ఐపి68 రేటింగ్‌ కలిగి ఉంది. అధికారికంగా ఒన్‌ప్లస్‌ విడుదల చేసిన డస్ట్‌ - వాటర్‌ రెసిస్టెన్స్‌ ఉన్న ఫోన్‌ ఇది.  4150ఎంఎహెచ్‌ బ్యాటరీ, ర్యాప్‌ చార్జ్‌ 30టి ఫాస్ట్‌, 30డబ్ల్యు వైర్‌లెస్‌ ఫాస్ట్‌ చార్జింగ్‌, వైర్‌లెస్‌ రివర్స్‌ చార్జింగ్‌ సదుపాయాలు ఉన్నాయి.  క్వాల్కామ్‌ స్నాఫ్‌ డ్రాగన్‌ 863 పవర్‌ సైతం ఉంది. 



యాపిల్‌ ఐఫోన్‌ 11... (రూ.59,990)

యాపిల్‌ ఐఫోన్‌ 11 ప్రొ, 11ప్రొ మాక్స్‌, 11 ఇందులో రకాలు.ఈ 11 సిరీస్‌ ఐపి68 రేటింగ్‌తో వచ్చింది. దుమ్ము, దూళి, నీటి నుంచి రక్షణ కల్పించే ఫోన్లు ఇవి.  రెండు మీటర్ల మేర నీటిలో 30 నిమిషాల సేపు ఉన్నప్పటికీ ఈ ఫోన్లు ఏమీ చెడిపోవు.



శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌21... 

(రూ.69,999 నుంచి)

శాంసంగ్‌ ఎస్‌21, ఎస్‌21+, ఎస్‌21 అలా్ట్ర ఇందులో రకాలు. డస్ట్‌, వాటర్‌ రెసిస్టెన్స్‌ కలిగిన ఈ ఎస్‌21 సిరీస్‌ ఫోన్లకు ఐపి68 రేటింగ్‌ ఉంది. ఆండ్రాయిడ్‌ 11 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ మీద పనిచేస్తాయి. కంపెనీకే చెందిన ఎగ్జినోస్‌ 2100 ప్రాసెసర్‌ కూడా ఉంది. 



శాంసంగ్‌ గెలాక్సీ నోట్‌ 21... (రూ.79,999 నుంచి)

శాంసంగ్‌ గెలాక్సీ నోట్‌ 21, గెలాక్సీ నోట్‌ అలా్ట్ర ఇందులో రకాలు. గత సంవత్సరం విడదలైన ఈ రెండూ డస్ట్‌, వాటర్‌ రెసిస్టెన్స్‌ కలిగి ఉన్నాయి. ఎస్‌ పెన్‌ సపోర్టుకు తోడు వీటికి ఎగ్జినోస్‌ 990 ప్రాసెసర్‌ సపోర్ట్‌ ఉంది. ఎకెజీ, డోల్‌బై ఆటోమస్‌ ట్యూన్‌తో ఫీచర్‌ స్టీరియో స్పీకర్లు అదనం. 

x


శాంసంగ్‌ గెలాక్సీ నోట్‌ 21... (రూ.79,999 నుంచి)

శాంసంగ్‌ గెలాక్సీ నోట్‌ 21, గెలాక్సీ నోట్‌ అలా్ట్ర ఇందులో రకాలు. గత సంవత్సరం విడదలైన ఈ రెండూ డస్ట్‌, వాటర్‌ రెసిస్టెన్స్‌ కలిగి ఉన్నాయి. ఎస్‌ పెన్‌ సపోర్టుకు తోడు వీటికి ఎగ్జినోస్‌ 990 ప్రాసెసర్‌ సపోర్ట్‌ ఉంది. ఎకెజీ, డోల్‌బై ఆటోమస్‌ ట్యూన్‌తో ఫీచర్‌ స్టీరియో స్పీకర్లు అదనం. 



షావోమీ రెడ్‌మీ నోట్‌10: స్పా  ్లష్‌ రెసిస్టెంట్‌ (రూ.11,999 నుంచి) 

ఈ ఫోన్‌ ఇటీవలే విడుదలైంది. ఐపి53 రేటింగ్‌ ఉంది. స్ప్లాష్‌ రెసిస్టెంట్‌ అని అర్థం క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 678 ప్రాసెసర్‌కు తోడు 5,000 ఎంఎహెచ్‌ బ్యాటరీ, 33 డబ్లు ఫాస్ట్‌ చార్జింగ్‌ సపోర్ట్‌ ఉన్నాయి. 



షావోమీ రెడ్‌మీ నోట్‌ 10 ప్రొ, 

10 ప్రొ మాక్స్‌ స్ప్లాష్‌ రెసిస్టెంట్‌ (రూ.15.999 నుంచి)

ఐపి 53 రేటింగ్‌తో ఈ రెండు ఫోన్లు వచ్చాయి. నీటి తుంపర్లు పడితే పర్వాలేదు. నీటిలో మునిగితే మాత్రం ఈ ఫోన్లతో ఇబ్బందే. ఆండ్రాయిడ్‌   11  ఆపరేటింగ్‌ సిస్టమ్‌పై పనిచేస్తాయి. ఎ1యు1 12 లేయర్‌కు తోడు క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 732జి ప్రాసెసర్‌ కలిగి ఉన్నాయి. 



శాంసంగ్‌ గెలాక్సీ ఎ72 (రూ.34,999 నుంచి)

ఐపి67 రేటింగ్‌ ఉన్న ఈ ఫోన్‌ వాటర్‌ ప్లస్‌ డస్ట్‌ రెసిస్టెంట్‌. ఆక్టాకోర్‌ క్వాల్కామ్‌ 720 జి ప్రాసెసర్‌, 8 జిబి ర్యామ్‌, 5,000 ఎంఎహెచ్‌ బ్యాటరీ, 25 డబ్ల్యు ఫాస్ట్‌ చార్జింగ్‌ సపోర్టు కలిగి ఉంది. 



శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌ 20 ఎఫ్‌ఇ  

(రూ.44,999 నుంచి)

ఐపి68 రేటింగ్‌ ఉన్న ఈ ఫోన్‌ వాటర్‌ ప్లస్‌ డస్ట్‌ రెసిస్టెంట్‌. ఆక్టాకోర్‌ క్వాల్కామ్‌ 865 జి ప్రాసెసర్‌ ఉంది. ఆండ్రాయిడ్‌ 11 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ మీద పనిచేస్తుంది. ఎకెజీ, డోల్‌బై ఆటోమస్‌ ట్యూన్‌తో స్పోర్ట్స్‌ స్టీరియో స్పీకర్లు అదనం. 



పోకో ఎక్స్‌3: స్ప్లాష్‌ రెసిస్టెంట్‌

(రూ.16,999 నుంచి)

ఐపి53 రేటింగ్‌తో దీన్ని గత ఏడాది విడుదల చేశారు. 6,000 ఎంఎహెచ్‌ బ్యాటరీ, 33 డబ్ల్యు ఫాస్ట్‌ చార్జింగ్‌ సపోర్ట్‌ ఉన్నాయి.



ఒప్పో ఫైండ్‌ ఎక్స్‌2 (రూ.64,490)

ఐపి65 రేటింగ్‌తో విడుదలైంది. తక్కువ ఒత్తిడి కలిగిన వాటర్‌ జెట్స్‌లో ఇబ్బంది ఉండదు. ఆండ్రాయిడ్‌ 10 ఆపరేటింగ్‌ సిస్టమ్‌పై పనిచేసే దీనికి క్వాల్కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 865 ప్రాసెసర్‌ ఉన్నాయి.



శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌20 అలా్ట్ర... 

(రూ.69,990 నుంచి)

అన్ని  టాప్‌ ఎండ్‌ స్మార్ట్‌ ఫోన్ల మాదిరిగా ఇవి కూడా ‘వాటర్‌ -ప్రూఫింగ్‌’ తరహాకు చెందినవే. గెలాక్సీ ఎస్‌ 20 సిరీస్‌లో వచ్చాయి.  గెలాక్సీ ఎస్‌20 అలా్ట్ర, ఎస్‌20 ప్లస్‌, ఎస్‌20 పేరిట విడుదలయ్యాయి. ఐపి68 రేటింగ్‌ ఉంది. ఒకటిన్నర మీటర్ల నీటి అడుగున అర్ధగంట సేపు ఉన్నప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. 



యాపిల్‌ ఐఫోన్‌ ఎక్స్‌ఆర్‌... 

(రూ.47,900 నుంచి)

యాపిల్‌ ఐఫోన్‌ ఎక్స్‌ఆర్‌, ఐఫోన్‌ ఎక్స్‌ఎస్‌, ఐఫోన్‌ ఎక్స్‌ఎస్‌ మాక్స్‌ పేరిట ఉన్న వీటికి ఐపి68 రేటింగ్‌ ఉంది. 11 సిరీస్‌ మాదిరిగానే ఒకటిన్నర మీటర్ల నీటి అడుగున అర్ధగంట సేపు ఉన్నప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు.  



మోటో ఎడ్జ్‌ ప్లస్‌: స్ప్లాష్‌ రెసిస్టెంట్‌ (రూ.64,999)

మోటోకు సంబంధించి ఇది ప్రీమియమ్‌ ఫోన్‌. ఐపి52 రేటింగ్‌ ఉంది. క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 865 ప్రాసెసర్‌, 12 జిబి ర్యామ్‌ ఉన్నాయి. 






వన్‌ ప్లస్‌ 9 ప్రొ (రూ.64,999 నుంచి)

ఐపి68 రేటింగ్‌ ఉంది. వన్‌ ప్లస్‌ నుంచి విడుదలైన ఖరీదైన ఫోన్‌ ఇదే.  నెలాఖరు నుంచి అమ్మకాలు ఆరంభం కానున్న ఈ ఫోన్‌కు క్వాల్కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 888 ప్రాసెసర్‌, 4,500 ఎంఎహెచ్‌ బ్యాటరీ, 65 డబ్ల్యు రాప్‌ చార్జ్‌ ఉన్నాయి.





యాపిల్‌ ఐఫోన్‌ 12... (రూ.69,990)

యాపిల్‌ ఐఫోన్‌ 12 ప్రొ, 12ప్రొ మాక్స్‌, 12 ఇందులో రకాలు. ‘వాటర్‌ సేఫ్‌’గా పేర్కొంటున్న ఈ 12 సిరీస్‌ ఐపి68 రేటింగ్‌తో వచ్చింది. ఇవి కూడా దుమ్ము, దూళి, నీటి నుంచి రక్షణ కల్పించే ఫోన్లు.  రెండు మీటర్ల మేర నీటిలో 30 నిమిషాల సేపు ఉన్నప్పటికీ ఈ ఫోన్లు ఏమీ చెడిపోవు.


Updated Date - 2021-04-03T06:07:21+05:30 IST