వెంకటాపురంలో బావి నుంచి నీటిని తోడుతున్న గ్రామస్థులు
గొలుగొండ మండలం వెంకటాపురంలో రెండు నెలలుగా ఇదే దుస్థితి
మంచి నీటి పథకం మోటారు పాడైనా పట్టించుకోని అధికారులు
నాతవరం మండలంలోని పలు గ్రామాల్లో పనిచేయని చేతి బోర్లు
గొలుగొండ, మార్చి 27 : వేసవి పూర్తిస్థాయిలో ఆరంభం కాకముందే పలు గ్రామాలను నీటి సమస్య వెంటా డుతోంది. గుక్కెడు నీటి కోసం అక్కడి వారు అష్టకష్టాలు పడుతున్నారు. మం డలంలోని సాలికమల్లవరం పంచాయతీ శివారు వెంకటాపురంలో రెండు నెలలుగా ఇదే పరిస్థితి నెలకొంది. ఈ గ్రామంలో వంద మంది జనాభా నివా సం ఉంటున్నారు. ఇక్కడున్న తాగునీటి పథకానికి సంబంధించిన మోటారు పాడవ్వడంతో కుళాయిల ద్వారా నీటి సరఫరా జరగడం లేదు. దీంతో గ్రామానికి కిలో మీటరు దూరం తాగు నీటి ట్యాంకుకు నీటిని ఎక్కించేందుకు ఏర్పాటు చేసిన బావి వద్దకు వెళ్లి నీటి తెచ్చుకుంటున్నారు. అంత దూరం వెళ్లి నీటిని తోడుకుని.. బిందెలు మోసు కుని.. రావడం చాలా ఇబ్బందిగా ఉం దని మహిళలు వాపోతున్నారు. అధికా రులు వెంటనే స్పందించాల్సిందిగా వారంతా కోరుతున్నారు. ఈ సమస్యను ఆర్డబ్ల్యూఎస్ జేఈ సుధీషణ వద్ద ప్రస్తావించగా, రెండు రోజుల్లో విద్యుత్ మోటారుకు మరమ్మతులు చేపట్టి, తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు.
మూడు గ్రామాల్లో మూలకు చేరిన చేతిబోర్లు
నాతవరం: వేసవిలో నీటి కష్టా లను గట్టెక్కించేవి చాలా గ్రామాల్లో చేతి బోర్లే. ఎండలు మండి భూగర్భ జలాలు అడుగంటినప్పుడు, విద్యుత్ కోతల సమయాల్లో మోటార్లు ఉన్నా అంతగా ప్రయోజనం ఉండదు. ఆయా సమయాల్లో చాలా మంది చేతి బోర్ల వద్దకు పరుగు తీసి తమగొంతు తడు పుకుంటుంటారు. అయితే మండలం లోని పలు గ్రామాల్లో ఈ బోర్లు మూలకు చేరాయి. నెలల తరబడి వీటి వంక చూసేవారు లేకపోవడంతో అవి ఉత్సవ విగ్రహాల్లా దర్శనమిస్తున్నాయి. నాతవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద మెయిన్ రోడ్డు పక్కనున్న చేతి బోరు, అలాగే, సరుగుడు పంచాయతీ రామన్నపాలెంలో చేతిబోరు, యరకంపేట ప్రాథమిక పాఠశాల దగ్గరలో ఉన్న బోరు ప్రస్తుతం పనిచేయడం లేదు. దీంతో ఆయా ప్రాంతాల వారు తాగునీటికి ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు. అయినప్పటికీ అధికారుల్లో స్పందన లేకపోతోంది. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు స్పెషల్ డ్రైవ్ ద్వారా గ్రామాల్లో పనిచేయని చేతి బోర్లపై సర్వే చేయించి, వాటికి మరమ్మతులు చేపట్టాలని అంతా కోరుతున్నారు.