రబీలో సాగునీటి ఎద్దడి లేకుండా చూడాలి

ABN , First Publish Date - 2022-01-22T06:22:46+05:30 IST

అధికారులు సమన్వ యంతో పనిచేసి రబీ సీజన్‌లో సాగునీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకోవాలని ఎంపీపీ కుడుపూడి భాగ్యలక్ష్మి సూచిం చారు.

రబీలో సాగునీటి ఎద్దడి లేకుండా చూడాలి

అమలాపురం రూరల్‌, జనవరి 21: అధికారులు సమన్వ యంతో పనిచేసి రబీ సీజన్‌లో సాగునీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకోవాలని ఎంపీపీ కుడుపూడి భాగ్యలక్ష్మి సూచిం చారు. మండలపరిషత్‌ కార్యాలయ సమావేశ మందిరంలో మండలస్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశం శుక్ర వారం చైర్మన్‌ సలాది శ్రీనివాసచక్రవర్తి అధ్యక్షతన నిర్వ హించారు. ఎంపీపీ భాగ్యలక్ష్మి, వ్యవసాయశాఖ సహాయ సం చాలకుడు ఎంఏ షంషీలు ముఖ్య అతిథులుగా హాజరయ్యా రు. ప్రస్తుత రబీ సీజన్‌లో నీటి ఎద్దడి నివారణకు మండల స్థాయి, కాల్వలవారీ నీటి పారుదల మోనటరింగ్‌ కమిటీలను కలెక్టర్‌ ఆదేశాలతో వేసినట్టు తెలిపారు. భట్నవిల్లి, రోళ్లపాలెం గ్రామాల్లో కాల్వలకు నీటిమట్టం పెంచాలని రైతులు అధి కారుల దృష్టికి తీసుకువచ్చారు. ఏ.వేమవరం, భట్నవిల్లి డ్రైయిన్లలో పూడిక తొలగించి నీటి సరఫరా సక్రమంగా జరి గేలా చూడాలన్నారు. సమావేశంలో ఎంపీడీవో ఎం.ప్రభాకర రావు, తహశీల్దార్‌ గెడ్డం రవీంద్రనాథ్‌ఠాగూర్‌, మండల వ్యవ సాయాధికారి కె.ధర్మప్రసాద్‌, నీటిపారుదల, డ్రైయిన్స్‌ అధికా రులు కె.శ్రీనివాసరావు, కె.శాంతాదేవి, ఉద్యాన శాఖ అధికారి ఎం.శైలజ, ఏఎంసీ చైర్మన్‌ బొక్కా ఆదినారాయణ, సెంట్రల్‌ డెల్టా వాటర్‌ బోర్డు చైర్మన్‌ కుడుపూడి వెంకటేశ్వర, బద్దే రామకృష్ణ, అధికారులు, రైతులు పాల్గొన్నారు.



Updated Date - 2022-01-22T06:22:46+05:30 IST