వావ్‌ పుచ్చకాయ హల్వా!

ABN , First Publish Date - 2020-05-11T06:28:48+05:30 IST

వేసవికాలంలో చలువ చేసే పుచ్చకాయను తింటాం. అయితే కాయ లోపటి ఎర్రటి గుజ్జును తిన్నాక మిగిలిన పై తొక్కను పారేస్తాము. కానీ దాంతో తియ్యటి హల్వా...

వావ్‌ పుచ్చకాయ హల్వా!

వేసవికాలంలో చలువ చేసే పుచ్చకాయను తింటాం. అయితే కాయ లోపటి ఎర్రటి గుజ్జును తిన్నాక మిగిలిన పై తొక్కను పారేస్తాము. కానీ దాంతో తియ్యటి హల్వా చేసుకోవచ్చని తెలుసా? 


కావలసినవి :

  1. పుచ్చకాయపై తొక్క భాగం
  2. నెయ్యి - 3 టేబుల్‌ స్పూన్లు
  3. బొంబాయిరవ్వ - టేబుల్‌ స్పూను
  4. శనగపిండి-టేబుల్‌ స్పూను ఫ పంచదార- అరకప్పు
  5. దాల్చిన చెక్క పౌడర్‌ - అర టేబుల్‌ స్పూను
  6. జాజికాయ పౌడర్‌ - చిటికెడు
  7. పాలు - కప్పు ఫ బాదం - పిడికెడు


తయారీ:

పుచ్చకాయను తిన్నాక పైన మిగిలే ఆకుపచ్చ ముక్కలు తీసుకోండి. వాటి చివర్లను, పైన పచ్చగా కనిపించే భాగాన్ని చాకుతో తొలగించండి. లోపల తెల్లటి భాగం మాత్రమే మిగిలి ఉంటుంది. దాన్ని చిన్న ముక్కలుగా కట్‌ చేసి గ్రైండర్‌లో వేసి మెత్తటి గుజ్జుగా చేయండి. 

కడాయిలో నెయ్యి వేసి వేడిచేయండి. బొంబాయిరవ్వ, సెనగపిండి వేసి కలుపుతూ గోధుమరంగులోకి మారేదాక సన్నమంట మీద వేడిచేయండి. గ్రైండ్‌ చేసుకున్న గుజ్జును ఇందులో వేసి, పెద్ద మంట మీద నీరంతా ఆవిరైపోయేదాకా ఉడికించాలి. దీనికి పంచదార, దాల్చిన చెక్క, జాజికాయ పౌడర్‌లు వేసుకోవాలి. తరువాత పాలు పోసి, బాదం, పిస్తా పప్పులు వేసుకోని ఒక పాత్రలోకి తీసుకొని చల్లారనివ్వాలి. అంతే నోరూరించే పుచ్చకాయ హల్వా రెడీ.


Updated Date - 2020-05-11T06:28:48+05:30 IST