లాభాల పుచ్చకాయ

ABN , First Publish Date - 2021-03-06T04:37:42+05:30 IST

వేసవి కాలం వచ్చిందంటే విరివిగా లభించేది పుచ్చకాయలు.

లాభాల పుచ్చకాయ
సాగుపై ఆసక్తి చుపుతున్న అన్నదాత

ఎండాకాలంలో భలే గిరాకీ

తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు

సాగుపై ఆసక్తి చుపుతున్న అన్నదాతలు

ఇటిక్యాల, మార్చి 5: వేసవి కాలం వచ్చిందంటే విరివిగా లభించేది పుచ్చకాయలు. ఎండ వేడిమి నుంచి రక్షించే ఈ ఫలాలు రైతులకు మంచి లాభాలు తెచ్చి పెడుతున్నాయి. తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు వస్తుండడంతో రైతులు కూడా వీటి సాగుపై ఆసక్తి చూపుతున్నారు. ఇటిక్యాల, కారుపాకుల, వావిలాల, తదితర గ్రామాల్లో పుచ్చకాయ సాగు చేస్తున్నారు. దాదాపు 60 ఎకరాల్లో పుచ్చకాయ పంట సాగైనట్టు తెలుస్తోంది. కాయ సైజును బట్టి రూ.30 నుంచి రూ.70 వరకు విక్రయిస్తున్నట్లు రైతులు తెలుపుతున్నారు. వేసవిలో ప్రజలు అధికంగా ఇష్టపడే పుచ్చకాయ కాయడంతో మార్చి, ఏప్రిల్‌, మే, నెలల్లో అధికంగా డిమాండ్‌ ఉంటుందని రైతులు తెలుపుతున్నారు.

పంట సాగులో లాభాలు

ఎకరాకు విత్తనాల ఖర్చు రూ.5వేల వరకు వస్తుండగా మొత్తం రూ.60 వేల వరకు పెట్టుబడి అవుతుందని ఉద్యానవన శాఖ అధికారులు చెబుతున్నారు. నాటిన నాటి నుంచి వంద రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఎకరాకు దిగుబడి 30 టన్నుల వరకు దిగుబడి వస్తుంది.



Updated Date - 2021-03-06T04:37:42+05:30 IST