వావ్... టెక్ మహీంద్రా..

ABN , First Publish Date - 2021-07-30T03:34:00+05:30 IST

అంచనాలను సైతం తలకిందులు చేస్తూ ఊహించని రీతిలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మేజర్ టెక్ మహీంద్రా తొలి త్రైమాసిక ఫలితాలు చోటుచేసుకున్నాయి.

వావ్... టెక్ మహీంద్రా..

పూనే : అంచనాలను సైతం తలకిందులు చేస్తూ ఊహించని రీతిలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మేజర్ టెక్ మహీంద్రా తొలి త్రైమాసిక ఫలితాలు చోటుచేసుకున్నాయి. తొలి త్రైమాసిక లాభం  39.17 శాతానికి ఎగబాకి, వార్షికంగా ఏకీకృత నికర లాభం రూ . 1,353.2 కోట్లకు పెరిగింది. కిందటి సంవత్సరం ఇదే త్రైమాసికంలో త్రైమాసిక ప్రాతిపదికన, లాభం 25.13 శాతం పెరిగింది. జూన్ 2021 త్రైమాసికంలో కార్యకలాపాల నుంచి ఏకీకృత ఆదాయం 11.98 శాతం పెరిగి రూ. 10,197.6 కోట్లకు చేరుకుంది.  ఏడాది క్రితం ఇదే కాలంలో కంపెనీ రూ. 9,106 కోట్ల ఆదాయాన్నార్జించింది. 

Updated Date - 2021-07-30T03:34:00+05:30 IST