సాఫల్యానికి మార్గాలు

ABN , First Publish Date - 2021-02-26T05:57:23+05:30 IST

కుటుంబ వ్యవస్థ చక్కగా ఉన్నప్పుడే మంచి సమాజం ఏర్పడుతుంది. అలాంటి సమాజంలో నివసించే వారు ఉత్తమమైన విలువలు కలిగి ఉంటారు. అందుకే దైవ ప్రవక్త మహమ్మద్‌ కుటుంబ వ్యవస్థ పటిష్టంగా

సాఫల్యానికి మార్గాలు

కుటుంబ వ్యవస్థ చక్కగా ఉన్నప్పుడే మంచి సమాజం ఏర్పడుతుంది. అలాంటి సమాజంలో నివసించే వారు ఉత్తమమైన విలువలు కలిగి ఉంటారు. అందుకే దైవ ప్రవక్త మహమ్మద్‌ కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉండాలని సూచించేవారు. కుటుంబంలో భార్యాభర్తల బంధం ఎంతో పవిత్రమైనది. సృష్టికి ఇదే మూలం. ఈ బంధం ద్వారానే దేవుడు ఉత్తమమైన మానవ జాతిని లోకంలోకి తీసుకువచ్చాడు. పవిత్రమైన, ప్రత్యేకమైన ఈ బంధం ఫలప్రదంగా, గౌరవప్రదంగా ఉంటేనే మానవ జాతి సాఫల్యం పొందుతుంది.


మంచి కుటుంబ నిర్మాణంలో, తద్వారా నీతివంతమైన సమాజ నిర్మాణంలో మహిళలు, పురుషులు పాలుపంచుకోవాలి. దంపతుల్లో ఒకరిది ఎక్కువ పాత్ర, మరొకరిది తక్కువ పాత్ర అని ఉండవు. సాంసారిక జీవిత నియమాలు, బాధ్యతలు సరిగ్గా అర్థం  చేసుకోవాలి. సాధారణంగా మహిళలపై పురుషులకు ఎలాంటి హక్కులు ఉన్నాయో మహిళలకు కూడా పురుషుల పట్ల అలాంటి హక్కులే ఉన్నాయని దివ్య ఖుర్‌అన్‌లో అల్లాహ్‌ ప్రకటించారు.


భార్యాభర్తలు ఎవరి బాధ్యతలను వారు నెరవేర్చాలి. ఒకరి హక్కులను ఒకరు గుర్తించాలి. పరస్పరం గౌరవించుకోవాలి. దైవం ఆదేశాలనూ, ప్రవక్త హితవులనూ పాటించాలి. అలా చేసినప్పుడు జీవితం సుఖమయం అవుతుంది. ఇహలోక, పరలోక సాఫల్యం కలుగుతుంది. ఈ విధంగా మంచి కుటుంబ, సామాజిక బంధాలే సాఫల్యానికి మార్గాలవుతాయి.


మహమ్మద్‌ వహీదుద్దీన్‌

Updated Date - 2021-02-26T05:57:23+05:30 IST