సింహంలా పంజా విసురుతాం

Published: Wed, 26 Jan 2022 00:24:29 ISTfb-iconwhatsapp-icontwitter-icon
సింహంలా పంజా విసురుతాం  పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల భారీ ర్యాలీ

అదరం... బెదరం..

హక్కుల కోసం ఉద్యమిస్తున్నాం... దుష్ప్రచారం చేస్తే ఊరుకోం

చీకటి జీఓలు రద్దు చేయకపోతే సత్తా చూపిస్తాం

దిగిరాకపోతే... సమ్మెకూ సై...

ధర్నాలో ప్రభుత్వానికి పీఆర్సీ సాధన సమితి నేతల హెచ్చరిక

అనంతలో కదం తొక్కిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు

నగరంలో భారీ ర్యాలీతో కిక్కిరిసిన రహదారులు

పలు ప్రజా, రాజకీయ పార్టీల నేతల సంఘీభావం

అనంతపురం, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): ‘హక్కుల కోసం ఉద్యమిస్తున్నాం. ప్రభుత్వ అదిరింపులు.. బెదిరింపులకు భయపడే పరిస్థితే లేదు.  పోరుబాటలో అడుగు ముందుకేగానీ వెనక్కివేసేది లేదు.  మాపై దుష్ప్రచారం చే సి దెబ్బ కొట్టాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. చీకటి జీఓలు రద్దు చేయకపోతే సత్తా ఏంటో చూపిస్తాం. మేము చెప్పిందే వేదమని ప్రభుత్వం ముందుకు వెళ్తే... అందుకు తలూపేందుకు ఎవరూ ఇక్కడ సిద్ధంగా లేరు. అశుతోష్‌ మిశ్రా కమిటీ నివేదికను బట్టబయలు చేయాలి. ఉద్యోగ, ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్‌ను పరిష్కరించాలి. అలాకాదని ఉద్యోగులు, ఉపాధ్యాయులపై పోలీసులను అ డ్డుపెట్టుకొని ఉద్యమాన్ని అణచివేయాలని చూసినా, ప్రస్తుతమున్న జీతాలతో పాటు పెండింగ్‌లో ఉన్న డీఏలు చెల్లించేందుకు దిగిరాకపోతే సమ్మెకూ సిద్ధం’ అని పీఆర్సీ సాధన సమితి నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేస్తున్న ఉద్యమానికి పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ, కార్మిక సంఘాల నాయకులు సంఘీభావాన్ని ప్రకటించారు. పీఆర్సీ పోరుబాటలో భాగం గా మంగళవారం పీఆర్సీ సాధ న సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేపట్టారు. ధర్నా వేదికకు చేరుకునేందుకుగానూ  ఆర్ట్స్‌ కళాశాల మైదానం నుంచి వేలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయు లు, పెన్షనర్లు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీతో నగరంలోని ప్రధాన రహ దారులు, కూడళ్లు ఉపాధ్యాయులు, ఉద్యోగులతో కిక్కిరిసిపోయాయి. ర్యాలీ పొడవునా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు మిన్నంటాయి. ముఖ్యమంత్రి డౌన..డౌన అంటూ ఉద్యోగ, ఉపాధ్యాయులు నినదించారు. పోలీసులు ఆంక్షలను విధించినా... పెద్ద ఎత్తున ఉద్యోగులు, ఉపాధ్యాయులు ర్యాలీలో భాగస్వాములై కదం తొక్కారు. కార్యక్రమంలో ఏపీ జేఏసీ-అమరావతి జి ల్లా చైర్మన దివాకర్‌రావు, ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌, ఏపీ జీఈఏ చైర్మన గోపీకృష్ణ, ప్రధాన కార్యదర్శి శ్రీరామమూర్తి, ఏపీజీఈఎఫ్‌ చైర్మన రాధాకృష్ణరెడ్డి, ఏపీ జేఏసీ నగర చైర్మన మనోహర్‌రెడ్డి, ఆంధ్రప్రదశ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట చెన్నప్ప, ఏపీటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి నరసింహులు, ఫ్యాప్టో చైర్మన జయరామిరెడ్డి, ఏపీటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుల శేఖర్‌ రెడ్డి, ఫ్యాప్టో సెక్రటరీ జనరల్‌ సాలవేముల బాబు, ఎంఈఎఫ్‌ జాతీయ అదనపు ప్రధాన కార్యదర్శి బండారు శంకర్‌, గిరిజన ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్య దర్శి రవీంద్రనాథ్‌, ఏపీఎన్జీఓ రాష్ట్ర ఉపాఽధ్యక్షుడు మాధవ, రవికుమార్‌, శ్రీధర్‌బాబు, నాయకులు రాజేశ్వరీ, ఉమా దేవి, జమీలాబేగం, వేణుగోపాల్‌, శ్రీధర్‌స్వామి, చంద్ర మోహన, సాంబశివమ్మ, వెంకటరమణ, నాగభూషనరెడ్డి, ఫరూక్‌,  ఏ పీటీఎఫ్‌ నాయకులు శ్రీనివాసులు, సిరాజుద్దీన, యూటీఎఫ్‌ నియకుతు నాగేంద్ర, ఎస్టీయూ నాయకులు రమణారెడ్డి, సూరీడు, ఏపీటీఎఫ్‌1938 నాయకులు రవీంద్ర, విశ్వనాథ్‌ రెడ్డి, వెంకటరెడ్డి, ఏపీహెచఎంఏ జయరామిరెడ్డి, ఆప్టా వెం కటరత్నం, డీటీఎఫ్‌ బాబు, పీఆర్‌టీయూ చంద్రశేఖర్‌రెడ్డి, విష్ణువర్ధనరెడ్డి, ఎస్‌ఎల్‌టీఏ శివానందరెడ్డి, సీపీఎం నాయకులు నాగేంద్రకుమార్‌, సీఐటీయూ వెంకటనారాయణ, ఏఐటీయూసీ నాయకులు రాజారెడ్డి, నాగరాజు, నరసింహులు పాల్గొన్నారు. 


పీఈటీల అర్ధనగ్న ప్రదర్శన

పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టి నిరసన ర్యాలీలో పీఈటీల అర్ధనగ్న ప్రదర్శన ఆకట్టుకుంది.  పలువురు పీఈటీలు తమ ఒంటిపై పీఆర్సీ రద్దు అనే అక్షరాలతో అర్ధనగ్న ప్రదర్శన ఇచ్చారు. ఆర్ట్స్‌ కళాశాల నుంచి కలెక్టరేట్‌ వరకూ సాగిన ర్యాలీలో మండుటెండను లెక్కచేయకుండా ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్‌ ధర్నా వేదిక అర్ధనగ్న ప్రదర్శన చేశారు. ధర్నా ప్రారంభం నుంచి ముగింపు వరకూ ధర్నా ఆవరణమంతా అర్ధనగ్న ప్రదర్శన చేస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లను ఉత్తేజపరుస్తూ కనిపించారు. 


మేము సైతమన్న అంధ, వికలాంగ ఉద్యోగ, ఉపాధ్యాయులు

రివర్స్‌ పీఆర్సీ రద్దు చేయాలంటూ చేపట్టిన నిరసన ర్యాలీ, ధర్నాలో పలువురు అంధ, వికలాంగ ఉద్యోగ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రెండు గంటల పాటు సాగిన ర్యాలీలో మేము సైతమంటూ అడుగులు వేశారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న అంధ, వికలాంగ ఉద్యోగ, ఉపాధ్యాయులు ర్యాలీ, ధర్నాలో భాగస్వాములై నినాదాలు చేశారు. 

ఎక్కడున్నావ్‌ జగనన్నా అంటూ కళాకారుల గేయాలు

నేను విన్నా. నేను చూశా. నేనున్నాన్నంటివే ఏమి విన్నావో? ఏమి చూశావో? ఎక్కడున్నావో? అంటూ ముఖ్య మంత్రి జగనపై కళాకారులు పాడిన పాటలు ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లలో రెట్టింపు ఉత్సాహాన్ని నింపాయి. అడగకుండానే ఐఆర్‌ ఇస్తానని... ఉన్నదానిని ఊడ గొడుతున్నావంటూ పాడిన పాటలు, నృత్యాలు ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో ఉద్యమస్ఫూర్తిని నింపాయి.


అడుగడుగునా పోలీసుల ఆంక్షలు

కలెక్టరేట్‌ వద్ద పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమానికి హాజరుకాకుండా పలు ప్రాంతా ల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులను పోలీసులు అ డుగడుగునా అడ్డుకున్నారు. గోరంట్లలో పలువురు ఉద్యోగు లు, ఉపాధ్యాయులను స్థానిక పోలీసులు అడ్డుకొని స్టేష నకు తీసుకెళ్లారు. ధర్నా ముగిసేంత వరకూ వారిని అక్కడే ఉంచారు. రాయదుర్గం మండలంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులను గుండ్లపల్లి క్రాస్‌ వద్ద స్థానిక సీఐ అడ్డుకున్నారు. శివారులోనూ ఉద్యోగులు, ఉపాధ్యాయులను స్థానిక సీఐ అడ్డుకున్నారు. ఇలా పలు ప్రాంతాల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు పోలీసుల ఆంక్షలను ఎదుర్కొన్నారు. ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తూ... టీచర్లు, ఉద్యో గులు ఎవరైనా ఉంటే దిగిపోవాలని ఎక్కడికక్కడ పోలీసు అధికారులు ఆరా తీసినప్పటికీ... వాటిని లెక్కచేయక పెద్ద ఎత్తున మహాధర్నాలో ఆ వర్గాలు పాల్గొన్నాయి. 


ఎమ్మెల్సీల మద్దతు: ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి

ఎవరికీ ఆమోదయోగ్యం కాని 11వ పీఆర్సీతో ప్రతి ఒక్కరూ నష్టపోతున్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు హక్కుగా ఎ న్నో పోరాటాలు చేసి సాధించుకున్న హెచ ఆర్‌ఏ స్లాబ్‌లను తగ్గించడం, డీఏలు ఇవ్వమని చెప్పడం బాధాకరం. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేనప్పుడు ఎందుకు హామీలివ్వడం? ఐఆర్‌ పెంచ మని ఎవరూ అడగలేదు. వారంలోపు సీపీఎస్‌ రద్దు చేస్తా నన్నారు. డీఏలిస్తామన్నారు. ఇప్పుడేమో రూ. 10,247 కోట్లు ఆర్థికభారం పడుతోందంటున్నారు. భారమైతే మీ దగ్గర పెట్టుకోండి. ఉద్యోగులు, ఉపాధ్యాయుల హక్కులు, సొమ్ము వారికివ్వండి. అంతేగానీ మేము చెప్పిందే వేద మంటే మాత్రం ఏ ఒక్క ఉద్యోగ, ఉపాధ్యాయుడు, పెన్షనర్‌, కార్మికుడు చూస్తూ ఊరుకోరు. ఉ ద్యమం మరింత ఉధృతమవుతుంది. నాతో పాటు ఆరుగురు శాసనమండలి సభ్యులంతా ఉద్యమానికి మద్దతుగా నిలు స్తాం. ఇప్పటికైనా సీఎం సంఘాల నాయకులను చర్చలకు పిలవాలి. అందరితో చర్చలు జరిపి మెరుగైన పీఆర్సీ ఇవ్వడం తో పాటు హెచఆర్‌ఏ, డీఏలను వెంటనే విడుదల చేయాలి. 


సింహాల్లా గర్జిస్తాం : అతావుల్లా, ఏపీ జేఏసీ జిల్లా చైర్మన

మా హక్కులు, ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న హెచఆర్‌ఏల కోసం రోడ్లపైకి రావడం ఎంతో సిగ్గుగా ఉంది. మేమిచ్చిందే పీఆర్సీ. ఇచ్చినంత తీసుకోవాలంటే ఎవరూ ఒప్పుకోరు. హక్కుల సాధన కోసం యుద్ధం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం. ఏం చేయలేరని అను కుంటే పొరపాటే. ప్రతి ఉపాధ్యాయుడు, ఉద్యోగి, పెన్షనర్‌, కార్మికుడూ సింహంలాంటోడే. అవసరమైనప్పుడు  గర్జి స్తాం. పంజా విసురుతాం. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తు పెట్టుకోవాలి. అరెస్టులతో ఉ ద్యమాన్ని అణచి వేయాలని చూస్తే తట్టుకోలేరు. ఇప్పటికైనా సీఎం, ప్రభుత్వ పెద్దలు ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకుంటే మంచిది. లేకుంటే రాబోయే రోజుల్లో ఉద్యమం ఉగ్రరూపం దాల్చక తప్పదు. 


ఉపాధ్యాయులపై దుష్ప్రచారాలు చేయడం హేయమైన చర్య: నరసింహులు, 

ఏపీటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి

ఉపాధ్యాయులు తొలిసారిగా కలెక్టరేట్‌ ఎదుట చేసిన ఉద్యమానికి బెదిరి అర్ధరాత్రి చీకటి జీఓలను జారీ చేశా రు. ఉద్యమాలు చేస్తున్నారనే ఎక్కడో ఒకచోట ఇబ్బంది పెడుతున్నా రు. పాఠశాలలకు లేటుగా వస్తున్నారని చిత్రీకరించి మీ అనుకూల సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది ప్రభుత్వానికి తగదు. అలాంటి జిమ్మిక్కులతో ఉద్యమం ఆగదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏం తినేలా లేం... ఏం కొనేలా లేమన్నది ముఖ్యమంత్రిగా మీకు తెలియదా.?. అలాంటప్పుడు హెచఆర్‌ఏను ఎలా తగ్గిస్తారు...? గతంలో ఎన్నడూ లేని విధంగా 11వ దౌర్భా గ్య పీఆర్సీని తీసుకొస్తే చూస్తూ ఊ రుకోం. మెరుగైన పీఆ ర్సీని ప్రకటించాల్సిందే. హెచఆర్‌ఏ స్లాబ్‌ను పెంచాల్సిందే. డీఏలన్నింటినీ వెంటనే విడుదల చేయాల్సిందే. అంత వరకూ ఉద్యమం ఆగదు.


అసంబద్ధ నిర్ణయాలతో ప్రభుత్వానికే నష్టం: గేయానంద్‌, మాజీ ఎమ్మెల్సీ

అసంబద్ధ నిర్ణయాలతో ప్రభుత్వానికే నష్టం. ఉద్యోగ, ఉ పాఽ ద్యాయ, పెన్షనర్లు, కార్మికులు వారి న్యాయమైన డి మాండ్ల కోసం ఉద్యమాలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణం. 11వ పీఆర్సీ ఏ ఒక్కరికీ అమోద యోగ్యంగా లేదు. కనీసం పీఆర్సీ రూపొందించే సమయంలో ఏ సంఘం నాయకులను చర్చలకు పిలవకపోగా ఐఏఎస్‌ అధికారులు, ప్రభుత్వ పెద్దలు అందించిన నివేదికలతో పీఆర్సీని రూపొందించమేంటి..? ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, సీఎం మరోసారి పీఆర్సీపై ఆలోచించాలి.  ఉద్యోగ, ఉపాధ్యాయుల డిమాండ్ల సాధన కోసం వారు చేపట్టే పోరుబాటలో మేము కూడా భాగస్వాములవుతాం.


కోత పెట్టేందుకేనా కల్లబొల్లి హామీలు: ఓబులు, సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యుడు

ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన వాటిలో కోత పెట్టేందుకేనా కల్లబొల్లి హామీలిచ్చారా? మెరుగైన ఐఆర్‌ ఇవ్వమని ఎవరడిగారు మిమ్మల్ని? అధికారముందనే అహంకారంతో కార్మికుల జీవితాలో ఆడుకుంటున్నారు. అమలు చేయలేని హామీలిచ్చారు. అవి చేయకపోగా... ఉన్నవాటిలోనూ కోత పె ట్టేశారు. ఇది కోతల ప్రభుత్వమని మరోసారి నిరూపించుకుంది. నేను విన్నా. నే ను చూశా. నేనున్నాన్న సీఎం జగన ఏం విన్నా రో? ఏం చూశారో? ఎ క్కడున్నారో అర్థం కావ డం లేదు. పీఆర్సీ విషయంలో ఆయనకు ఎవ రు సలహాలిచ్చారో అ ర్థం కావడం లేదు. ప్రతి ఉద్యోగి, ఉపాధ్యాయు డు, కార్మిక, పెన్షనర్‌ క డుపు మండుతోంది. ఉ ద్యమం ఉగ్రరూపం దా ల్చకముందే న్యాయమై న డిమాండ్లను పరిష్కరించాలి.

సింహంలా పంజా విసురుతాం  చంటిబిడ్డతో నిరసనలో పాల్గొన్న మహిళా ఉద్యోగిని


సింహంలా పంజా విసురుతాం  ధర్నాలో పాల్గొన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు


సింహంలా పంజా విసురుతాం  ధర్నాలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.