‘పంచాయతీలకు బిల్లులు అందక గోస తీస్తున్నాం’

ABN , First Publish Date - 2021-12-07T05:26:50+05:30 IST

‘పంచాయతీలకు బిల్లులు అందక గోస తీస్తున్నాం’

‘పంచాయతీలకు బిల్లులు అందక గోస తీస్తున్నాం’
అదనపు కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌కు సమస్యలు వివరిస్తున్న యాచారం మండల సర్పంచులు

యాచారం: గ్రామపంచాయతీలకు నెలనెలా రావాల్సిన బిల్లులు అందక తాము తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నామని యాచారం మండలంలోని 11 గ్రామాలకు చెందిన 11 సర్పంచులు సోమవారం కలెక్టర్‌ అమాయ్‌కుమార్‌, అదనపు కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌లను కలెక్టరేట్‌లో కలిసి మొర పెట్టుకున్నారు. గత కొంతకాలంగా పంచాయతీలకు ఇవ్వాల్సిన బిల్లులు అందకపోవడంతో తాము అప్పులపాలవుతున్నామన్నారు. గ్రామపంచాయతీల నిధుల నుంచి మండల పరిషత్‌కు 15శాతం నిధులను ఇవ్వకుండా ఉత్తర్వులు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా హరితహారం కింద మొక్కలకు నీరు పట్టడం తదితర కార్యక్రమాలకు గత కొంతకాలంగా నిధులు విడుదల చేయకపోవడంతో తాము అప్పులు చేయక తప్పడం లేదని సర్పంచులు వారితో ఆందోళన వ్యక్తం చేశారు. సర్పంచుల సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌లు వారికి హామీ ఇచ్చారు. అదేవిధంగా గ్రామాల్లో  పేదలకు రేషన్‌కార్డులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సర్పంచులు డీఎ్‌సవో ఎంకే రాథోడ్‌ను కలిసి వివరించారు. కొత్త రేషన్‌కార్డుల జారీ తమ చేతిలోలేదని, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేయాల్సి ఉందని డీఎ్‌సవో సర్పంచులకు తెలిపారు.

Updated Date - 2021-12-07T05:26:50+05:30 IST