రిటైర్‌మెంట్‌ వయోపరిమితి పెంపుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రుణపడి ఉంటాం

ABN , First Publish Date - 2021-07-28T05:55:45+05:30 IST

సింగరేణి కార్మికుల రిటైర్‌మెంట్‌ వయోపరిమి తి పెంచడంతో ముఖ్యమంత్రికి రుణపడి ఉంటామని టీబీజీకేఎస్‌ అధ్యక్షు డు బీ వెంకట్రావ్‌ అన్నారు.

రిటైర్‌మెంట్‌ వయోపరిమితి పెంపుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రుణపడి ఉంటాం
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న వెంకట్రావ్‌

- టీబీజీకేఎస్‌ అధ్యక్షుడు వెంకట్రావ్‌

గోదావరిఖని, జూలై 27: సింగరేణి కార్మికుల రిటైర్‌మెంట్‌ వయోపరిమి తి పెంచడంతో ముఖ్యమంత్రికి రుణపడి ఉంటామని టీబీజీకేఎస్‌ అధ్యక్షు డు బీ వెంకట్రావ్‌ అన్నారు. మంగళవారం గోదావరిఖని టీబీజీకేఎస్‌ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సింగరేణి కార్మికులంటే అమితమైన ప్రేమ అని, వయోపరిమితి పెంచాలని టీబీజీకేఎస్‌ గౌరవ అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవితకు విన్నవించామన్నారు. ఈనెల 16న ముఖ్యమంత్రిని తాను, మిర్యాల రాజిరెడ్డి, కే మల్లయ్య వినతిపత్రం అందించామన్నారు. స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ వయోపరిమితి 61కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారని, వెనువెంటనే సింగరేణి బోర్డు మీటింగ్‌లో కూడా ఆమోదం తెలిపారన్నారు. కార్మికుల వయోపరిమితి పెంపుపై ఎమ్మెల్సీ కవిత, మంత్రి కొప్పుల ఈశ్వ ర్‌, ప్రభుత్వవిప్‌ బాల్క సుమన్‌తోపాటు కోల్‌బెల్ట్‌ ఎమ్మెల్యేలు, ఎంపీల కృషి అభినందనీయమన్నారు. విలేకరుల సమావేశంలో మిర్యాల రాజిరెడ్డి, కే మల్లయ్య, గండ్ర దామోదర్‌రావు, నూనె కొమురయ్య, జాహిద్‌ పాషా, వెంకటేష్‌, ఎట్టం కృష్ణ, దేవ వెంకటేశం, నాయిని మల్లేష్‌, యాదవరెడ్డి, శం కర్‌నాయక్‌, పుట్ట రమేష్‌, కృష్ణమూర్తి, ఎడవెల్లి రాజారెడ్డి, గంగాధర్‌, కుశనపల్లి శంకర్‌, రవి, మల్లారెడ్డి, రమేష్‌, స్వామిదాస్‌, ఐలయ్య పాల్గొన్నారు.

Updated Date - 2021-07-28T05:55:45+05:30 IST