చాకలి ఐలమ్మ పోరాటమే మనకు స్ఫూర్తి

Sep 26 2021 @ 22:22PM
చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేస్తున్న జడ్పీ చైర్‌పర్సన్‌, కలెక్టర్‌

ఆసిఫాబాద్‌, సెప్టెంబరు 26: తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ చేసిన పోరాటమే మనకు స్ఫూర్తి దాయకమని జడ్పీ చైర్‌పర్సన్‌ కోవలక్ష్మి అన్నారు. ఆదివారం కలెక్టరేట్‌లో నిర్వ హించిన చాకలిఐలమ్మ జయంతి ఉత్సవా లలో భాగంగా కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌తో  కలిసి చాకలిఐలమ్మ చిత్రపటానికి పూల మాలవేసి నివాళులర్పించారు. ఈ సంద ర్భంగా ఆమెమాట్లాడుతూ చాకలి ఐలమ్మ చేసిన పోరాటాలు భావితరాలు తెలుసుకునే విధంగా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌, ఎంపీపీ అరిగెల మల్లిఖార్జున్‌, బీసీ సంక్షేమాధికారి సత్యనారయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రెబ్బెన: మండలకేంద్రంలో చాకలి ఐలమ్మ జయం తిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సంద ర్భంగా చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేశారు. అనంతరం పలువురు మాట్లాడుతూ చాకలి ఐలమ్మ ఆశయాలను సాధించే దిశగా అంతా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సౌందర్య, జడ్పీటీసీ సభ్యుడు సంతోష్‌, సింగిల్‌విండో చైర్మన్‌ సంజీవ్‌, సర్పంచ్‌లు సోమశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. 

కెరమెరి: మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు జయంతి నిర్వహించారు.  కార్యక్రమంలో తహసీల్దార్‌ భుజంగ్‌రావు, ఎంఆర్‌ఐ రాథోడ్‌ అనసూయ, ఎంఆర్‌ఐ వివేక్‌, వీఆర్వో నారాయణ, వీఆర్‌ఎ రాజ్‌కుమార్‌ పాల్గొన్నారు.

కాగజ్‌నగర్‌ టౌన్‌: కాగజ్‌నగర్‌లో ఆదివారం చాకలి ఐలమ్మ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీ వైస్‌చైర్మెన్‌ కోనేరు క్రిష్ణారావు ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో సర్‌సిల్క్‌కాలనీ రజక సంఘం సభ్యులు పాల్గొన్నారు.

పెంచికలపేట: మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో, తహసీల్దార్‌ కార్యాలయంలో అధికారులు, నాయకులు చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.

Follow Us on: