మేం నిజమైన నరకంలో జీవిస్తున్నాం: Ukraine ప్రసూతి ఆసుపత్రిలో బాలింతల ఆవేదన

ABN , First Publish Date - 2022-03-03T14:27:39+05:30 IST

ఉక్రెయిన్ దేశంపై రష్యా సైనికదాడి నేపథ్యంలో కైవ్ నగరంలోని ఓ ప్రసూతి ఆసుపత్రి ఓ బాలింత పడిన అవస్థలు తెలుసుకుంటే కన్నీళ్లు ఆగవు...

మేం నిజమైన నరకంలో జీవిస్తున్నాం: Ukraine ప్రసూతి ఆసుపత్రిలో బాలింతల ఆవేదన

కైవ్ (ఉక్రెయిన్): ఉక్రెయిన్ దేశంపై రష్యా సైనికదాడి నేపథ్యంలో కైవ్ నగరంలోని ఓ ప్రసూతి ఆసుపత్రిలో బాలింతలు పడిన అవస్థలు తెలుసుకుంటే కన్నీళ్లు ఆగవు. రష్యా రాకెట్, క్షిపణి దాడుల మధ్య ప్రసూతి ఆసుపత్రిలో బాలింతలు పడుతున్న పాట్లు వర్ణణాతీతంగా మిగిలాయి. ఉక్రేనియా దేశంపై ఫిబ్రవరి 24వతేదీన రష్యా దండయాత్ర ప్రారంభమయ్యే ముందు కైవ్ నగరంలోని మెటిర్నిటీ ఆసుపత్రిలో ప్రసవం కోసం నిండు గర్భిణి అలెనా షింకర్ చేరారు.రాకెట్లు, క్షిపణి దాడులు, బాంబు పేలుళ్ల మధ్య ఫిబ్రవరి 28వతేదీన ఆసుపత్రిలో అలెనా షింకర్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు.రష్యా సైనికదాడుల మధ్య మేం ప్రసూతి ఆసుపత్రిలో నిజమైన నరకంలో జీవిస్తున్నామని బాలింత అలెనా షింకర్ చెప్పారు. ప్రసూతి ఆసుపత్రిలోని భూగర్భంలో ఉన్న బెడ్ పై మనసు ప్రశాంతంగా ఉంచుకునేందుకు అలెనా పుస్తకం చదువుతూ కూర్చొంది.


‘‘మేం నిజమైన నరకంలో జీవిస్తున్నాం. 21వ శతాబ్దంలో ఇలాంటివి జరుగుతాయని నేనెప్పుడూ ఊహించలేదు’’ అని అలెనా ఆవేదనగా చెప్పింది.సిజేరియన్ ద్వారా ప్రసవించిన మహిళలను బాంబుల దాడి నుంచి రక్షించడానికి భూగర్భంలో ఉన్న వార్డులకు తరలించామని ఆసుపత్రి వైద్యులు చెప్పారు.నవజాత శిశువులను ఇంక్యుబేటర్లలో ఉంచి భూగర్భంలోని వార్డుకు తరలించారు. రష్యా దాడులు జరుగుతున్నా ప్రసూతి ఆసుపత్రిలో ప్రసవం చేసిన ఆసుపత్రి సిబ్బందిని బాలింతలు అభినందించారు.‘‘ఫిబ్రవరి 24 వతేదీ ఉదయం 5 గంటలకు రాకెట్ దాడి శబ్ధంతో నేను మేలుకొన్నాను, పేలుడు శబ్ధం, మహిళలు అరుపులు విన్నాను. యుద్ధం ప్రారంభమైందనే విషయాన్ని నేను నమ్మలేకపోయాను. ఇది ఏదో పీడకల అనుకున్నాను, కానీ మేం నరకంలా జీవిస్తున్నాం’’ అని మరో బాలింత చెప్పారు.


Updated Date - 2022-03-03T14:27:39+05:30 IST