పాస్టర్‌ ప్రవీణ్‌ను ప్రశ్నిస్తున్నాం: సీఐడీ

ABN , First Publish Date - 2021-01-22T09:13:54+05:30 IST

హిందూ దేవతా విగ్రహాలను ధ్వంసం చేసినట్లు వీడియో ద్వారా వెల్లడించిన పాస్టర్‌ ప్రవీణ్‌ చక్రవర్తిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నట్లు సీఐడీ వెల్లడించింది.

పాస్టర్‌ ప్రవీణ్‌ను ప్రశ్నిస్తున్నాం: సీఐడీ

అమరావతి, జనవరి 21(ఆంధ్రజ్యోతి): హిందూ దేవతా విగ్రహాలను ధ్వంసం చేసినట్లు వీడియో ద్వారా వెల్లడించిన పాస్టర్‌ ప్రవీణ్‌ చక్రవర్తిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నట్లు సీఐడీ వెల్లడించింది. అవసరాన్ని బట్టి తగిన సమయంలో వివరాలు వెల్లడిస్తామని, టీవీలు, పత్రికలు ఎటువంటి కథనాలు ప్రచురించవద్దని డీజీపీ కార్యాలయం గురువారం ప్రకటించింది. 12న ప్రవీణ్‌ చక్రవర్తిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు పేరొంది. 18న కస్టడీ కోసం కోర్టుకు విన్నవించగా 20నుంచి మూడు రోజుల అనుమతి లభించిందని చెప్పారు. సీఐడీ ప్రకటన ఇస్తే తప్ప కేసుకు సంబంధించి ఎటువంటి కథనాలు ప్రచురించవద్దని సూచించారు. సీఐడీ విజ్ఞప్తిని కాదని ఎవరైనా కథనాలు ఇస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

Updated Date - 2021-01-22T09:13:54+05:30 IST