మేం బ్యాంకులనే.. నువ్వు దేశాన్ని కొల్లగొడుతున్నావ్‌!

ABN , First Publish Date - 2022-07-02T09:41:12+05:30 IST

ఇటీవలికాలంలో ఓటీటీలో బాగా పాపులర్‌ అయిన ‘మనీహెయిస్ట్‌’ వెబ్‌సిరీస్‌ గుర్తుందా? ప్రధాని మోదీ హైదరాబాద్‌ పర్యటన నేపథ్యంలో..

మేం బ్యాంకులనే.. నువ్వు దేశాన్ని కొల్లగొడుతున్నావ్‌!

మోదీనుద్దేశించి ‘మనీహెయిస్ట్‌’ పోస్టర్‌తో ఫ్లెక్సీ.. తొలగింపు

మన్సూరాబాద్‌, జూలై 1(ఆంధ్రజ్యోతి): ఇటీవలికాలంలో ఓటీటీలో బాగా పాపులర్‌ అయిన ‘మనీహెయిస్ట్‌’ వెబ్‌సిరీస్‌ గుర్తుందా? ప్రధాని మోదీ హైదరాబాద్‌ పర్యటన నేపథ్యంలో.. ఆ వెబ్‌సిరీ‌స్‌లో కనిపించే బ్యాంకు దొంగల పోస్టర్‌తో ఎల్బీనగర్‌లో ఓ పోస్టర్‌ వెలిసింది! ‘‘మిస్టర్‌ మోదీ.. మేం బ్యాంకులను మాత్రమే కొల్లగొడితే, నువ్వు దేశాన్నే కొల్లగొడుతున్నావ్‌’’ అని ఆ దొంగలు మోదీని ఉద్దేశించి అన్నట్టుగా ఓ క్యాప్షన్‌ను ఆ ఫ్లెక్సీలో పెట్టారు. సీఎం కేసీఆర్‌పై బీజేపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలతో ప్రారంభమైన వివాదం.. టీఆర్‌ఎస్‌ శ్రేణులు అంతకు మించి ఫ్లెక్సీలు పెట్టడంతో ముదురుతోంది. ఇరు పార్టీల మధ్య ఫ్లెక్సీలతో పెద్ద యుద్ధమే నడుస్తోంది. ఈ క్రమంలో.. ఎల్బీనగర్‌ కూడలిలో ఈ ఫ్లెక్సీని ఎవరు పెట్టారన్నది చర్చానీయాంశమైంది. కాగా.. ఈ ఫ్లెక్సీలోని క్యాప్షన్‌ వివాదాస్పదం కావడంతో సాయంత్రానికి దాన్ని తొలగించారు.

Updated Date - 2022-07-02T09:41:12+05:30 IST