ఉత్సవ విగ్రహాలయ్యాం

ABN , First Publish Date - 2021-03-07T04:32:52+05:30 IST

తెలంగాణ ప్రభుత్వ హయాంలో నిధులు లేక ఉత్సవ విగ్రహాలుగా మారిపోయామని గొర్లఖాన్‌దొడ్డి ఎంపీటీసీ సభ్యుడు బొజ్జయ్య నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.

ఉత్సవ విగ్రహాలయ్యాం
నేలపై కూర్చొని నిరసన తెలుపుతున్న గొర్లఖాన్‌దొడ్డి ఎంపీటీసీ సభ్యుడు బొజ్జయ్య నాయుడు

గ్రామాల్లో నిర్వహించే ప్రభుత్వ కార్యక్రమాలకు సమాచారం ఇవ్వడం లేదు

నేలపై కూర్చొని నిరసన తెలిపిన ఎంపీటీసీ సభ్యుడు

గట్టు, మార్చి 6: తెలంగాణ ప్రభుత్వ హయాంలో నిధులు లేక ఉత్సవ విగ్రహాలుగా మారిపోయామని గొర్లఖాన్‌దొడ్డి ఎంపీటీసీ సభ్యుడు బొజ్జయ్య నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఏంపీపీ విజయ్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నేలపై కూర్చొని నిరసన వ్యక్తం చేశాడు. గ్రామాల్లో నిర్వహించే ప్రభుత్వ కార్యక్రమాలకు కనీస సమాచారం ఇవ్వడం లేదని అన్నారు. తమను అగౌరవపరుస్తున్నారంటూ ఎంపీడీఓ పాండుతో వాగ్వాదానికి దిగాడు. ఎంపీడీవో క్షమాపణ చెప్పినా కొద్దిసేపు సభ జరగకుండా అడ్డుకున్నా డు. అనంతరం సభను బాయ్‌కాట్‌ చేశాడు. కాగా అధికార పార్టీకి చెందిన మెజార్టీ ఎంపీటీసీలు సమావేశానికి గైర్హాజర్‌ కావడంతో కోరం విషయంలో సందిగ్ధ త నెలకొంది. అనంతరం మాచర్ల, చాగదోణ, తుమ్మలచెర్వు, గొర్లఖాన్‌దొడ్డి ఎంపీటీసీలతో పాటు ఎంపీపీతో కలిపి కోరం కావడంతో సభను నిర్వహించారు.


అధికారుల తీరుపై సర్పంచ్‌ల ఆగ్రహం

 యల్లందొడ్డి గ్రామానికి పశువైద్యాధికారి రావడంలేదని సర్పంచ్‌ రాధిక సభలో అధికారుల దృష్టికి తె చ్చారు. గ్రామంలో వైద్యం అందక పశువులు, గొర్రెలు చనిపోతున్నా అడిగే నాథుడు లేడని పశువైద్య సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరింది. విద్యుత్‌ ఏఈపై గట్టు సర్పంచ్‌ యు.ధనలక్ష్మి మండిపడ్డారు.  సమావేశాలకు సరిగా రావడం లేదని, చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్‌ చేశారు. ఉపాధి పనులు చేసి నెలలు గడుస్తున్నా బిల్లులు రావడం లేదని సర్పంచ్‌లు అనిత, క్రిష్ణయ్యగౌడు, సిద్దిరామప్ప తదితరులు ఏపీఓపై మండిపడ్డారు. కార్యక్రమంలో సింగల్‌విండో చైర్మన్‌ వెంకటేష్‌, సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు హనుమంతునాయుడు పాల్గొన్నారు.


ప్రగతిని వివరించిన అధికారులు

వ్యవసాయశాఖ ప్రగతి గురించి ఏఈఓ తిరుమలేష్‌ సభ్యులకు వివరించాడు. తప్పెట్లమొర్సు గ్రామ  వ్యవసాయ అధికారి గ్రామానికి రావడం లేదని, చర్య లు తీసుకోవాలని సభలో అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఆరోగ్యశాఖ ప్రగతిని డాక్టర్‌ రాజసింహ, పశుసంవర్ధకశాఖ గురించి డాక్టర్‌ శంకరయ్య, ఐసీడీఎస్‌ గురించి సీడీపీవో ఇందిర, విద్యాశాఖ ప్రగతిని ఎంఈ ఓ కొండారెడ్డి, ఉపాధి హామీ పథకం గురించి ఏపీఓ ప్రసాద్‌, మిషన్‌ భగీరథ గురించి ఏఈ కృష్ణయ్య, రెవెన్యూ శాఖ గురించి ఆర్‌ఐ నాగిరెడ్డిలు సభ్యులకు వివరించారు.


Updated Date - 2021-03-07T04:32:52+05:30 IST