
ఢిల్లీ: రాష్ట్రంలోని పేదవాడి కోసం తమ ప్రభుత్వం అప్పు చేసిందని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. మీడియాతో ఆయన ఇక్కడ మాట్లాడారు. బ్యాంక్ ద్వారా లావాదేవీలు జరిగినపుడు 48 వేల కోట్ల అవినీతి జరిగిందని టీడీపీ ఎలా ఆరోపిస్తోందని అయన ప్రశ్నించారు. టీడీపీ నేత యనమల రామకృష్టుడు మాటలు తనను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయన్నారు. 15 అంశాలవారీగా ప్రతి దానికి పద్దు ఉందని ఆయన పేర్కొన్నారు. సీఎఫ్ఎంఎస్ నుంచి తప్పులు సరిదిద్దాడానికి సమయం పడుతుందన్నారు. సీఎఫ్ఎంఎస్ వ్యవస్థ ను టీడీపీ ప్రయివేట్ వ్యక్తి చేతిలో పెట్టిందన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఐఏఎస్ అధికారిని సీఈఓగా నియమించామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో నిధుల దుర్వినియోగం జరగలేదని ఆయన స్పష్టం చేశారు. అన్యాయంగా, దుర్మార్గంగా ప్రభుత్వాన్ని నిందించడం తప్పని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి