ప్రతీ గింజను కొనుగోలు చేస్తాం

ABN , First Publish Date - 2021-10-24T05:50:36+05:30 IST

కరోనా కష్టకాలంలో ఆరుగాలం కర్షకులు పండించి న వరి ధాన్యం కొనుగోళ్లలో కేంద్రం ప్రభుత్వం కాదన్నప్పటికీ.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రతి గింజ కొనుగోలుకు ముందుకు వచ్చిందని డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌ రెడ్డి పేర్కొన్నారు. శనివారం జాకోర, పాతవర్ని, హు మ్నాపూర్‌

ప్రతీ గింజను కొనుగోలు చేస్తాం
జాకోరాలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న డీసీసీబీ చైర్మన్‌

కేంద్రం కాదన్నా.. రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది : డీసీసీబీ చైర్మన్‌ 

జిల్లాలో పలుచోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం

వర్ని, అక్టోబర్‌ 23: కరోనా కష్టకాలంలో ఆరుగాలం కర్షకులు పండించి న వరి ధాన్యం కొనుగోళ్లలో కేంద్రం ప్రభుత్వం కాదన్నప్పటికీ.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రతి గింజ కొనుగోలుకు ముందుకు వచ్చిందని డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌ రెడ్డి పేర్కొన్నారు. శనివారం జాకోర, పాతవర్ని, హు మ్నాపూర్‌ గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు.  

వేల్పూర్‌: రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రానికి తాలు లేకుండా వరిధాన్యాన్ని తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని డీసీసీబీ వైస్‌చైర్మన్‌ రమేష్‌రెడ్డి అన్నారు. శనివారం మోతె గ్రామంలో పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.  

బాల్కొండ: పండించిన ధాన్యాన్ని దళారులకు అమ్మి రైతులు మోస పోవద్దని డీసీసీబీ వైస్‌చైర్మన్‌ రమేష్‌రెడ్డి అన్నారు. బాల్కొండ మండల కేంద్రంలో శనివారం సొసైటీ చైర్మన్‌ తూర్పు రమేష్‌రెడ్డితో కలిసి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. 

బోధన్‌ రూరల్‌: బోధన్‌ మార్కెట్‌ కమిటీ కార్యాలయం ఆవరణలో శనివారం సోసైటీ ఆవరణలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సోసైటీ చైర్మన్‌ ఉద్మీర్‌ లక్ష్మణ్‌ మాట్లాడారు.    

నిజామాబాద్‌ రూరల్‌: రూరల్‌ మండలం పాల్ద సొసైటీలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 

డిచ్‌పల్లి: రైతులు తాము పండించిన వరి ధాన్యం దళారులకు విక్రయించ వద్దని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించుకొని మద్దతు ధర పొందలని ధర్పల్లి జడ్పీటీసీ టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకులు బాజిరెడ్డి జగన్‌ పేర్కొన్నారు.  

Updated Date - 2021-10-24T05:50:36+05:30 IST