Asia Cup 2022 : భారత్ - పాకిస్తాన్ జట్ల మధ్య వ్యత్యాసం ఇదే.. పాక్ మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..

ABN , First Publish Date - 2022-08-15T00:33:05+05:30 IST

భారత్ వర్సెస్ పాకిస్తాన్ (India Vs pakistan) క్రికెట్ మ్యాచ్‌‌కు ఉండే క్రేజే వేరు. ఈ రెండు దేశాలు తలపడుతున్నాయంటే ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఆసక్తి కనబరుస్తారు.

Asia Cup 2022 : భారత్ - పాకిస్తాన్ జట్ల మధ్య వ్యత్యాసం ఇదే.. పాక్ మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..

ముంబై : భారత్ వర్సెస్ పాకిస్తాన్ (India Vs pakistan) క్రికెట్ మ్యాచ్‌‌కు ఉండే క్రేజే వేరు. ఈ రెండు దేశాలు తలపడుతున్నాయంటే ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఆసక్తి కనబరుస్తారు. ఇక భారత్, పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్స్‌కు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పనులన్నీ మానుకొని ఎంతో భావోద్వేగంతో మ్యాచ్‌ కోసం ఎదురుచూస్తారు. అందుకే మ్యాచ్‌కు ముందు మాజీ క్రికెటర్ల స్పందనలు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. ఇదే తరహాలో ఆసియా కప్‌-2022(Asia Cup2022)లో భాగంగా ఆగస్టు 28న భారత్ - పాక్ తలపడునున్న నేపథ్యంలో పాక్ మాజీ బౌలర్ ఆఖీబ్ జావెద్ (Aaqib Javed) ఆసక్తికరంగా స్పందించాడు. హార్ధిక్ పాండ్యా(Hardik Pandya) లాంటి నాణ్యమైన ఆల్ రౌండర్‌ పాకిస్తాన్‌కు లేడని, ఇరుజట్ల మధ్య ఇదే వ్యత్యాసమని పేర్కొన్నాడు. 


భారత్‌కు అపారమైన అనుభవం ఉన్న బ్యాటింగ్ లైనప్ ఉందని జావెద్ ప్రశంసించాడు. ముఖ్యంగా మిడిలార్డర్ చాలా బావుందని, రెండు టీమ్‌ల మధ్య ఇదే వ్యత్యాసమని పేర్కొన్నాడు. ‘‘బాబర్ అనుభవం ఉన్న ఆటగాడు. ప్రస్తుత ఆటగాళ్లంతా కొంతకాలంగా కలిసి ఆడుతున్నారు. కానీ ఇరుదేశాల మధ్య బ్యాటింగ్ విషయంలో వ్యత్యాసం ఉంది. ఇండియాకి అనుభవం ఉన్న ఆటగాళ్లు ఉన్నారు. రోహిత్ శర్మ చాలాకాలంగా ఆడుతున్నాడు. అతనొక్కడే ఆటని మలుపుతిప్పగలడు. మిడిలార్డర్, ఆల్‌రౌండర్ల విషయంలో ఇరుదేశాల మధ్య వ్యత్యాసం ఉందన్నారు.


కాగా చివరిసారిగా ఈ రెండు టీమ్‌లు గతేడాది యూఏఈ వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో(T20 World Cup) తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో భారత్ ఘోర ఓటమిని చవిచూసింది. భారత్ నిర్దేశించిన లక్ష్యాన్ని పాక్ ఓపెనర్లు ఇద్దరే చేధించారు. ఈ మ్యాచ్‌లో హార్ధిక్ పాండ్యా 11 పరుగులు చేశాడు. కానీ వెన్నునొప్పి కారణంగా బౌలింగ్ చేయలేదు. గాయం కారణంగా కొన్నాళ్లు ఆటకు దూరమయ్యాడు. ఆ తర్వాత ఐపీఎల్‌తోపాటు అంతర్జాతీయ మ్యాచ్‌లలో అదరగొట్టాడు. 2022 మొత్తం 13 టీ20 మ్యాచ్‌లు ఆడిన హార్ధిక్ పాండ్యా మొత్తం 281 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 140 శాతంగా ఉంది.

Updated Date - 2022-08-15T00:33:05+05:30 IST