8 ఏళ్లలో ఎంతో అభివృద్ధి చేశాం

ABN , First Publish Date - 2022-09-25T05:35:50+05:30 IST

ఎనిమిదేళ్లలో పాల మూరును ఊహించని విధంగా అభివృద్ధి చేశామ ని, ఇంకా ఎంతో అభివృద్ధి చేయాల్సి ఉందని రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి డాక్టర్‌ విరసనోళ్ల శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు.

8 ఏళ్లలో ఎంతో అభివృద్ధి చేశాం

- ఇంకా అభివృద్ధి చేయాల్సి ఉంది

- ఒకప్పుడు టీ తాగితే నీళ్లు

- ఇప్పుడు రోజూ భగీరథ నీళ్లు

- పింఛన్‌, బతుకమ్మ చీరలు పంపిణీలో ఎక్సైజ్‌ శాఖ మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్‌ 

మహబూబ్‌నగర్‌/ మహబూబ్‌నగర్‌ టౌన్‌/ పాలమూరు, సెప్టెంబరు 24 : ఎనిమిదేళ్లలో పాల మూరును ఊహించని విధంగా అభివృద్ధి చేశామ ని, ఇంకా ఎంతో అభివృద్ధి చేయాల్సి ఉందని రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి డాక్టర్‌ విరసనోళ్ల శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. పాలమూరు అంటే ఒకప్పుడు తాగునీటి కోసం కటకట ఉండేదని, హోటళ్లలో టీ తాగితేనే నీళ్లు ఇచ్చే పరిస్థితి ఉండేదని పేర్కొన్నారు. తెలం గాణ వచ్చిన తరువాత ఆ దుస్థితి పోయిందని, ప్రతీ ఇంటికి మిషన్‌భగీరథ శుద్ధ జలాలను ఇస్తు న్నామని అన్నారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ శనివారం జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి పనుల ప్రారం భోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. పలు వార్డు ల్లో మహిళలకు బతుకమ్మ చీరలు, లబ్ధిదారులకు ఆసరా పింఛన్‌ పత్రాలు పంపిణీ చేశారు.

స్థానిక స్త్రీ, శిశు సంక్షేమశాఖ కార్యాలయంలో పీడీ జరీనాబేగం ఆధ్వర్యంలో నిర్వహించిన బతుక మ్మ ఉత్సవాలలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌ తేజస్‌ నంద లాల్‌ పవర్‌ పాల్గొన్నారు. బతుకమ్మకు పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి మెట్టుగడ్డ ఐసీడీఎస్‌ కార్యాలయం సమీపంలో నిర్మించిన ఉద్యోగినుల నూతన వసతి గృహాన్ని మంత్రి, ఎంపీ ప్రారంభిం చారు. వీరన్నపేట 14, 31, 31, 32 వార్డుల్లో నూత నంగా మంజూరైన ఆసరా పింఛన్‌ పత్రాలు, బతు కమ్మ చీరలు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. పట్టణంలోని గ్రీన్‌బెల్టు ఏరియాలో కొండా లక్ష్మణ్‌ బాపూజీ విగ్రహం ఏర్పాటు చేసేందుకు ఎంపీ శ్రీని వాసరెడ్డితో కలిసి మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ భూమి పూ జ చేశారు. ఆయా సమావేశాల్లో మంత్రి మాట్లాడుతూ రానున్న రో జుల్లో మహబూబ్‌నగర్‌ను మోడల్‌ పట్టణంగా తీర్చిదిద్దుమని చెప్పా రు. బతుకమ్మ చీర ల ద్వారా చేనేత కార్మికులకు పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుందన్నారు. ఆయా కార్యక్ర మాల్లో అడిషనల్‌ కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవర్‌, మునిసిపల్‌ చైర్మ న్‌ కోరమోని నర్సింహులు, ముడా చైర్మన్‌ గంజి వెంకన్న, మార్కెట్‌ క మిటీ చైర్మన్‌ ఎం.ఎ. రహమాన్‌, నా యకులు రహమాన్‌, తాటి గణేష్‌, పోతుల గిరిధర్‌రెడ్డి, ఆర్డీఓ అనిల్‌ కుమార్‌, చెరుకుపల్లి రాజేశ్వర్‌, పద్మ శాలి సంఘం అధ్యక్షుడు ఎం. ప్రభాకర్‌, శివరాజు, కట్టా రవికిషన్‌రెడ్డి, అంజయ్య, చెన్నవీరయ్య, సాద త్‌, జ్యోతి, రాములు, రామలింగం పాల్గొన్నారు. 

ఇళ్ల కోసం డబ్బులడిగితే చర్యలు

మహబూబ్‌నగర్‌, సెప్టెంబరు 24 : డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్లు ఇప్పిస్తామని ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఇల్లు ఇప్పిస్తామని కొందరు అక్రమార్కులు డబ్బులు వసూలు చేసినట్లు తమ దృష్టికి వచ్చిన వెంటనే విచారణ జరిపించాలని కలెక్టర్‌, ఎస్పీలను ఆదేశించామని చెప్పారు. పేద ప్రజల కోసం నిర్మిస్తున్న ఇళ్లపై అక్రమాలకు పాల్పడితే సహించేది లేదన్నారు. ఎంతో కష్టపడి పేదలకోసం ఇళ్లు నిర్మిస్తున్నామని, కొందరు దళారులు నకిలీ డాక్యుమెంట్లను సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. మోసగించే వారి సమాచారం పోలీసులకు తెలపాలన్నారు. పేదలకు ప్రభుత్వం ఉచితంగా పథకాలు అందజేస్తుందని మంత్రి స్పష్టం చేశారు. 

Updated Date - 2022-09-25T05:35:50+05:30 IST