కరోనా కారణంగా.. ఒక్క ఉద్యోగినీ తొలగించలేదు: విప్రో

ABN , First Publish Date - 2020-07-14T01:19:09+05:30 IST

దేశాన్ని కరోనా మహమ్మారి గజగజలాడిస్తోంది. ఈ వైరస్ కారణంగా చాలా కంపెనీలు ఉద్యోగాల్లో కోతలు విధించాయి.

కరోనా కారణంగా.. ఒక్క ఉద్యోగినీ తొలగించలేదు: విప్రో

న్యూఢిల్లీ: దేశాన్ని కరోనా మహమ్మారి గజగజలాడిస్తోంది. ఈ వైరస్ కారణంగా సంభవించిన నష్టాలను ఎదుర్కోవడానికి చాలా కంపెనీలు ఉద్యోగాల్లో కోతలు విధించాయి. అయితే కరోనా కారణంగా తమ సంస్థలో ఎటువంటి ఉద్యోగాల కోతలు విధించలేదని విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ తెలిపారు. విప్రో వార్షిక సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కరోనా ప్యాండెమిక్ కారణంగా తమ ఐటీ సంస్థలో ఒక్క ఉద్యోగిని కూడా తొలగించలేదని షేర్‌హోల్డర్లకు చెప్పారు. అలాగే వైరస్ కారణంగా ఉద్యోగాల్లో ఎటువంటి కోతలు విధించే ఆలోచనా తమకు లేదని స్పష్టంచేశారు. గతేడాది కంపెనీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన రిషద్.. కంపెనీ నష్టాలను ఇతర మార్గాల ద్వారా ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు.

Updated Date - 2020-07-14T01:19:09+05:30 IST