ఏడాదికోమారు కరోనా టీకా తీసుకోవాల్సిరావచ్చు: మోడర్నా వ్యవస్థాపకుడు

ABN , First Publish Date - 2021-08-19T00:20:57+05:30 IST

భవిష్యత్తులో ఏడాదికి ఒకసారి కరోనా టీకా తీసుకోవాల్సిన పరిస్థితులు తలెత్తవచ్చని టీకా తయారీ సంస్థ మోడర్నా సహ వ్యవస్థాపకుడు నూబార్ అఫేయన్ తాజాగా వ్యాఖ్యానించారు.

ఏడాదికోమారు కరోనా టీకా తీసుకోవాల్సిరావచ్చు: మోడర్నా వ్యవస్థాపకుడు

వాషింగ్టన్: భవిష్యత్తులో ఏడాదికి ఒకసారి కరోనా టీకా తీసుకోవాల్సిన పరిస్థితులు తలెత్తవచ్చని  టీకా తయారీ సంస్థ మోడర్నా సహవ్యవస్థాపకుడు నూబార్ అఫేయన్ తాజాగా వ్యాఖ్యానించారు. బ్లూంబర్గ్ టీవీకి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అసలు బూస్టర్ డోసులు ఇవ్వాలా వద్దా అంటూ ప్రభుత్వాలు తలబాదుకుంటుంటే..నూబార్ మాత్రం ‘‘ఏడాదికోమారు టీకాలు’’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఫ్లూ టీకాల మాదిరిగానే కరోనా వ్యాక్సిన్‌ను కూడా కనీసం ఏడాదికోమారు తీసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు’’ అని ఆయన చెప్పారు. మోడర్నా సంస్థ ఇటీవల.. సగం డోసు ఇస్తే సరిపోయే బూస్టర్ టీకాను అభివృద్ధి చేసింది. ఈ టీకా ప్రభావశీలత అత్యత్భుతంగా ఉన్నట్టు ప్రాథమిక అధ్యయనాల్లో తేలిందని నూబార్ పేర్కొన్నారు. 

Updated Date - 2021-08-19T00:20:57+05:30 IST