కలిసికట్టుగా అభివృద్ధికి పాటుపడాలి

ABN , First Publish Date - 2021-05-07T05:47:45+05:30 IST

కలిసికట్టుగా అభివృద్ధికి పాటుపడాలి

కలిసికట్టుగా అభివృద్ధికి పాటుపడాలి
సమావేశంలో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి

  • కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి
  • పోచారం మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశం

ఘట్‌కేసర్‌ : మున్సిపాలిటీ పాలకవర్గాలు కలిసికట్టుగా ఉంటూ అభివృద్ధి పనులను శరవేగంగా నిర్వహించేందుకు నిరంతరం పాటుపడాలని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. గురువారం పోచారం మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చైర్మన్‌ బోయపల్లి కొండల్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ మున్సిపాలిటీలో సమావేశాల నిర్వహణ, వార్డుల వారిగా నిధుల కేటాయింపులు సంతృప్తికరంగా ఉన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా రూ.5.2కోట్లతో వివిధ అభివృద్ధి సనులు చేపట్టాలని ఏకగీవ్రంగా తీర్మానించారు. గ్రీన్‌ బడ్జెట్‌ కింద రూ.64లక్షల50వేలు, ఎల్‌ఆర్‌ఎస్‌ నిధుల కింద రూ.10లక్షలు, పట్టణ ప్రగతి ద్వారా రూ.37.10లక్షలు, 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి రూ.10లక్షలు, రాష్ట్ర పభుత్వ స్పెషల్‌ గ్రాంట్‌ ద్వారా మంజూరయ్యే రూ.3కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టాలని కౌన్సిల్‌ సమావేశంలో తీర్మానించారు. కార్యక్రమంలో వైస్‌చైర్మన్‌ నానావత్‌ రెడ్డియానాయక్‌, కమిషనర్‌ సురేష్‌, కౌన్సిలర్లు, కో-ఆప్షన్‌ సభ్యులు, పాల్గొన్నారు.

  • సీసీ రోడ్డు పనులు ప్రారంభం

ఘట్‌కేసర్‌లో/కీసర రూరల్‌ : ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీలోని 4వ వార్డు పరిధి మారుతినగర్‌ కాలనీలో రూ.7లక్షలతో  చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. మున్సిపాలిటీలో రోడ్లకు అధిక ప్రాధాన్యత కల్పించాలని మున్సిపల్‌ ప్రజాప్రతినిధులను, కమిషనర్‌ను ఆదేశించారు. అంతకు ముందు మున్సిపాలిటీ పరిధిలోని శివారెడ్డిగూడలో మండల రైతు సమస్వయ సమితి అధ్యక్షుడు కొంతం అంజిరెడ్డి ఏర్పాటుచేసిన రియల్‌ఎస్టేట్‌ కార్యాలయాన్ని మంత్రి, మేడ్చల్‌ జడ్పీ చైర్మన్‌ మలిపెద్ది శరత్‌ చంద్రారెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను పంపిణీ చేశారు. అలాగే దమ్మాయిగూడ మున్సిపల్‌ పరిధి 4వ వార్డులో రూ.11లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన చేసారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ వసుపతి ప్రణీత, వైస్‌చైర్మన్‌ నరేందర్‌రెడ్డి, కమిషనర్‌ స్వామి, కౌన్సిలర్లు, కో-ఆప్షన్‌ సభ్యులు, టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు. కాగా ఘట్‌కేసర్‌, పోచారం మున్సిపాలిటీల్లో జరిగిన మంత్రి పర్యటనల్లో నాయకులు, కార్యకర్తలు, ప్రజలున ఎక్కడా కూడా కొవిడ్‌ నిబంధనలు పాటించలేదు. ఆయా కార్యక్రమాల్లో మాజీ ఎమ్యెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి, ఎంపీపీ ఏనుగు సుదర్శన్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ ముల్లి పావని జంగయ్య యాదవ్‌, వైస్‌ చైర్మన్‌ పల్గుల మాధవరెడ్డి, బండారి శ్రీనివాస్‌ గౌడ్‌, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-07T05:47:45+05:30 IST