పోడు భూముల సమస్యపై సమన్వయంతో ముందుకుసాగాలి

ABN , First Publish Date - 2021-10-26T03:33:32+05:30 IST

జిల్లాలో పోడు భూముల సమస్యలపై సమన్వ యంతో ముందకుసాగాలని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. జిల్లా కేంద్రంలో కలెక్టరేట్‌లో సోమవారం అటవీ, రెవెన్యూ, పోలీసు సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పోడు భూముల సమస్యపై సమన్వ యంతో ముందుకు సాగాలన్నారు.

పోడు భూముల సమస్యపై సమన్వయంతో ముందుకుసాగాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

- కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

ఆసిఫాబాద్‌, అక్టోబరు 25: జిల్లాలో పోడు భూముల సమస్యలపై సమన్వ యంతో ముందకుసాగాలని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. జిల్లా కేంద్రంలో కలెక్టరేట్‌లో సోమవారం అటవీ, రెవెన్యూ, పోలీసు సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పోడు భూముల సమస్యపై సమన్వ యంతో ముందుకు సాగాలన్నారు. గిరి జనులు కొద్ది మొత్తంలో మాత్రమే సాగుచేస్తూ జీవనం కొనసాగిస్తే వారిపట్ల కొంత సానుభూతితో వ్యవహరించాలన్నారు. అలా కాకుండా ఒకే వ్యక్తి 30నుంచి 40ఎకరాల అటవీ భూమిని సాగు చేసే దానిని తిరిగి తీసుకోవాలన్నారు. అలాగే జిల్లాలో గంజాయి సాగులేకుండా చర్యలు తీసుకోవాలని ఆదే శించారు. ఎవరైనా అటవీ భూముల్లో గంజాయి సాగు చేస్తే వారి ఆర్‌వోఎఫ్‌ఆర్‌ రద్దు చేయడమే కాకుండా వారిపై పీడీయాక్ట్‌ నమోదు చేయాలన్నారు. రైతు బంధు రాకుండా చేయాలని, ఇతర ప్రభుత్వ పథ కాలు వారికి అమలు కాకుండా చేయాలన్నారు. దీనికి అన్ని శాఖలు కలిసి ముందుకు సాగాలన్నారు. ఎస్పీ వైవీఎస్‌ సుదీంద్ర, జిల్లాఅటవీశాఖ అధికారి శాంతా రాం, అదనపుకలెక్టర్‌ వరుణ్‌రెడ్డి, ఎక్సైజ్‌శాఖ అధికారి రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.

యాసంగిలో వరిపంట వేయొద్దు..

ఆసిఫాబాద్‌ రూరల్‌: రానున్న యాసంగిలో రైతులు వరిపంట వేయకూడదని కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో వ్యవసా యాధికారులకు యాసంగి పంటల మార్పిడిపై జిల్లా స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు వరిపంట వేయకుండా చూడాలని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వరిధాన్యం కొనుగోలు చేయకూడదని నిర్ణయించిందని రాష్ట్ర వ్యాప్తంగా వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి నిలువ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎఫ్‌సీఐ గోదాంలు అందుబాటులో లేవని అన్నారు. దీనితో వరి పంటనిలువ చేయడానికి ఇబ్బంది అవుతుందని అన్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం వరిధాన్యం కొనుగోలు చేయదని తెలిపారు. ఎవరైనా యాసంగిలో వరి విత్తనాలు అమ్మితే చర్యలు తీసుకుంటామన్నారు. పంట మార్పిడి చేయడం వల్ల భూసారం కూడా పెరుగుతుందని అన్నారు. ఈ విషయం రైతులకు అర్థ మయ్యేలా తెలియజేయాల్సిన బాధ్యత వ్యవసాయాధి కారులపై ఉందన్నారు. రైతులు పండించే గ్రామాల్లో కంది, పెసర, మినుము లాంటి పంటలపై అవగా హన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కార్యక్రమం లో జిల్లావ్యవసాయాధికారి శ్రీనివాసరావు, కేవీకే శాస్త్ర వేత్త నాగరాజు, వ్యవసాయాధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-26T03:33:32+05:30 IST