Advertisement

మహిళలకు అన్ని వేళలా సహాయ సహకారాలందిస్తాం

Mar 7 2021 @ 00:00AM
ర్యాలీలో పాల్గొన్న విద్యార్థినులు

ఎస్పీ కేకేఎన అన్బురాజన

కడప (క్రైం), మార్చి 7 : జిల్లాలోని అన్ని రంగాల్లో పనిచేస్తున్న మహిళలకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించడంతో పాటు ఏ విషయంలో అయినా ఇబ్బందులు వస్తే పరిష్కరించి వారికి చేయూతనందిస్తామని ఎస్పీ కేకేఎన అన్బురాజన తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా విభాగంలోని ప్రత్యేకతలను, సదుపాయాలను ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతి పోలీసుస్టేషనలో మహిళా పోలీసులు, అధికారులు, పోలీసు రిసెప్షనిస్టులు అన్ని వేళలా అందుబాటులో ఉంటారన్నారు. గ్రామ ప్రాంతాల్లో సచివాలయాల్లో గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి, వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శులను ఏర్పాటు చేశామన్నారు. మహిళలకు ఎదురయ్యే గృహ హింస, పనిచే సే చోట వేధింపులు, వరకట్న వేధింపులు, లైంగిక దాడులు, మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం తదితరాలపై ఫిర్యాదులు చేయడానికి దిశ మహిళా పోలీసుస్టేషనను జిల్లా కేంద్రంగా ప్రభుత్వ చొరవతో ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని తెలిపారు. ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేసుకుని వారం రోజుల్లో దర్యాస్తు పూర్తి చేసి న్యాయస్థానాల్లో చార్జిషీట్‌ దాఖలు చేయడం వల్ల సత్వర న్యాయం జరుగుతుందని తెలిపారు. 


అత్యవసర వేళల్లో ఆపన్న హస్తాలు

అత్యవసర వేళల్లో పోలీసు సహాయం పొందేందుకు డయల్‌ 100, 181, 112, 1098లలో వేటినైనా సంప్రదించవచ్చన్నారు. ఫిర్యాదు చేసేవారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. అలాగే అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ప్రతి మహిళా ‘దిశ‘ యాప్‌ను డౌనలోడ్‌ చేసుకుంటే అనేక లాభాలున్నాయన్నారు. దిశ యాప్‌లో ఎస్‌ఓఎస్‌ బటన నొక్కితే నేరుగా పోలీసు కంట్రోల్‌ రూముకు తక్షణం సంకేతాలు వెళ్లి సమీపంలోని పోలీసు సిబ్బందికి ఆ సమాచారం చేరవేసి ఆపదలో ఉన్న మహిళ వద్దకు పోలీసులను పంపించడం జరుగుతుందన్నారు. దీనివల్ల ఆపదలో ఉన్న మహిళలు సకాలంలో రక్షించబడతారన్నారు. పోలీసు శాఖ తరపున హెల్ప్‌లైన నెంబరు 9121100509, కడప డిసి్ట్రక్ట్‌ పోలీసు ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌  వేదికగా, ఇనస్టాగ్రామ్‌, యూట్యూబ్‌లను రూపొందించడం జరిగిందన్నారు. అంతేకాకుండా టఞజ్చుఛ్చీఞ్చ2014ఃజఝ్చజీజూ.ఛిౌఝ ద్వారా ్జకూడా ఫిర్యాదులు చేయవచ్చని తెలిపారు. ప్రతి ఒక్క మహిళా దిశ యాప్‌ను తమ మొబైల్‌లో డౌనలోడ్‌ చేసుకోవాలన్నారు. అంతేకాక యాప్‌ డౌనలోడ్‌ చేసుకున్న వారికి కడపలోని వసా్త్రలయాలు, మొబైల్‌ షాపులు, కిరాణా షాపులు, స్టేషనరీ, మెడికల్‌ తదితర అన్ని రకాల కొనుగోళ్లపై 10 నుంచి 55 శాతం వరకు రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 


జిల్లాలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు

పాఠశాల నుంచి కళాశాల స్థాయి వరకు ఉన్న విద్యాసంస్థల్లోని విద్యార్థినీ, విద్యార్థులకు స్థానిక పోలీసు అధికారులు మహిళలపై జరిగే నేరాలు, వారి రక్షణ కోసం చట్టాల గురించి విస్లృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం మహిళల కోసం స్థానిక ఉమే్‌షచంద్ర కల్యాణ మండపంలో మెగా మెడికల్‌ క్యాంపు నిర్వహించారు. అందులో మహిళలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి ప్రత్యేక వైద్యులచే వైద్య పరీక్షలు నిర్వహించారు.


కొవ్వొత్తుల ర్యాలీ

మహిళల్లో అవగాహన కల్పిస్తూ ఆదివారం సాయంత్రం జిల్లా వ్యాప్తంగా పోలీసుల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కడప నగరంలో కోటిరెడ్డిసర్కిల్‌ నుంచి సెవెనరోడ్స్‌ వరకు జరిగిన కొవ్వొత్తుల ర్యాలీలో ఎస్పీ అన్బురాజనతో పాటు అడిషనల్‌ ఎస్పీలు దేవప్రసాద్‌, రుషికేశవరెడ్డి, డీఎస్పీ సునీల్‌, తదితర పోలీసు అధికారులు పాల్గొన్నారు. మహిళల్లో ఆత్మస్థైర్యం నింపే విధంగా ర్యాలీ సాగింది. ర్యాలీలో విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 

 
క్యాండిల్‌ ర్యాలీలో ఎస్పీ, అడిషనల్‌ ఎస్పీ, డీఎస్పీ


Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.